భీమ్లా నాయక్‌ ఆడియో బద్దలయ్యింది

Update: 2021-08-30 04:53 GMT
పవన్ కళ్యాన్.. రానా లు కలిసి నటిస్తున్న భీమ్లానాయక్‌ సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఇటీవలే ప్రముఖ ఓటీటీ కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. డబ్బింగ్ సినిమా అయినా కూడా భారీగానే ఓటీటీ రేటు పలికింది అనేది టాక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ కూడా రికార్డ్‌ రేటుకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఆడియో సంస్థ ఈ సినిమా కు గాను రూ.5.04 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవల కాలంలో సర్కారు వారి పాట.. పుష్ప మరియు ఆచార్య సినిమా ల ఆడియో రేట్లు చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. తాజాగా భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ అయిదు కోట్లను మించడంతో పవన్ స్టామినా మరియు థమన్ సందడి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా లో ఉండే పాటలు తక్కువే అయినా కూడా కాన్సెప్ట్‌ బేస్డ్‌ ఉంటాయని అంటున్నారు. అందుకే ఈ సినిమా పాటలు తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటాయని సదరు ఆడియో సంస్థ ఈ మొత్తంను చెల్లించి భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.

భీమ్లా నాయక్‌ సినిమాలో పవన్ లుక్ మరియు పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని అంటున్నారు. లుంగీ కట్టి.. పోలీస్‌ యూనిఫామ్‌ లో పవన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మలయాళ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా రూపొందుతున్న భీమ్లా నాయక్‌ సినిమా ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా తో పవన్ తన మాస్ విశ్వరూపం చూపిస్తాడు అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మల్టీ స్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న ఈ సమయంలో భీమ్లా నాయక్‌ రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా నాన్ పాన్ ఇండియా సినిమా రికార్డ్‌ ను బ్రేక్ చేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా నమ్మకంతో ఉన్నారు.
Tags:    

Similar News