పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలి సారి రానా దగ్గుబాటితో కలిసి నటించిన చిత్రం`భీమ్లానాయక్`. మూడున్నరేళ్ల విరామం తరువాత బాలీవుడ్ రీమేక్ `వకీల్ సాబ్`తో మళ్లీ ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. `పింక్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ తో వపన్ కల్యాణ్ చేసిన మరో మూవీ `భీమ్లానాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్ ని ఆవిష్కిరించిన తీరు పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ని కూడా అమితంగా ఆకట్టుకుంది. `గబ్బర్ సింగ్` చిత్రం తరువాత పవన్ అంతకు మించిన మాస్ పాత్రలో నటించడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలో పవన్ తో కలిసి నటించిన రానా పాత్ర కూడా నువ్వా నేనా? అనే స్థాయిలో పవర్ ఫుల్ గా వుండటం సినిమాకు మరింత హైలైట్ గా మారింది. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైటైట్ గా నిలవడంతో ఆ సన్నివేశాలని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ థియేటర్ల వద్ద హల్ చల్ చేస్తున్నారు. సినిమా పై భారీ హైప్ క్రియేట్ కావడంతో తొలి రోజు ప్రారంభ వసూళ్లు రికార్డుని సృష్టించాయి.
ఇదిలా వుంటే థియేటర్లలో అరుపులు కేకలు ఈలలతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. సాగర్ కె. చంద్ర డైరెక్షన్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్నీ తానై వెనకుండి నడిపించిన ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఓన్లీ ఆహానే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిసి `భీమ్లానాయక్` ఓటీటీ రిలీజ్ హక్కుల్ని `ఆహా` సొంతం చేసుకుందట.
అయితే ఈ మూవీ థియేటర్లలో మాంచి ఫామ్ లో వుండగానే మార్చిలో `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై భీమ్లా మేకర్స్ కానీ , ఆహా వర్గాలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతే కాకుండా `భీమ్లానాయక్` ప్రీమియర్ కి సంబంధించి కూడా ఎలాంటి డేట్ ని అనౌన్స్ చేయలేదు. దీంతో ఆ వార్తలు నిజమా? కాదా? అన్నది ఆసక్తికరంగా మారింది. `భీమ్లానాయక్` ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారి మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాయని తెలిసింది.