పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సినిమా `అయ్యప్పనుమ్ కోషియమ్` కి రీమేక్ ఇది. మాతృకలో బిజు మీనన్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్రలో రానా నటిస్తున్నారు. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. పవన్-రానా లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. నిత్య కూడా షూటింగ్ కి హాజరవుతున్నారు. అయితే ఇంకా రానా భార్య రోల్ కి హీరోయిన్ కుదరలేదు.
కోలీవుడ్ నటి ఐశ్వర్యా రాజేష్ ని సంప్రదించగా ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో మేకర్స్ ఆ పాత్రని ఫుల్ ఫిల్ చేసే పనిలో సీరియస్ గా సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మలయాళం యువ నటి సంయుక్త మీనన్ ని రంగంలోకి దించాలని సంప్రదింపులు జరుపుతున్నారుట. నేచురల్ పెర్పార్మర్ కావాలనే సాగర్ చంద్ర పట్టుబడుతున్నారుట. అలాంటి ఔట్ పుట్ కేవలం మలయాళం.. కోలీవుడ్ నాయికల నుంచి తప్ప ఇతర భాషల భామల నుంచి తీసుకోలేమని భావిస్తున్నారుట. అందుకే పవన్ భార్య పాత్రకు నిత్యా మీనన్ ముందుగానే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ముంబై.. బెంగుళూరు నటులైతే సన్నివేశాల్లో వాస్తవం పండదని భావించే సాగర్ చంద్ర మలయాళ నటులపై ఫోకస్ చేసినట్లు సమాచారం. మరి రానా సరసన నటించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. ఇప్పటికే టాలీవుడ్ లో నివేథా థామస్..కీర్తి సురేష్.. అనుపమా పరమేశ్వరన్ లాంటి టాప్ క్లాస్ మలయాళ నటులు టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు.ఈ ముగ్గురికి ఉత్తమ నటులుగా సౌత్ లో మంచి పేరుంది. అలాగే మియా జార్జ్..మాళవిక నాయర్..మాళవిక మోహన్.. నిత్యా నరేష్ లాంటి నటీమణులు ఉన్నారు. మరి సాగర్ చంద్ర మైండ్ లో ఎవరున్నారో? చూడాలి.
ఆ ఇద్దరూ సమానంగానే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ కథ కంటెంట్ కుదిరితే ఏ రేంజు ఉంటుందో ఊహించగలం. చాలా గ్యాప్ తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తూ పింక్ రీమేక్ లో నటించారు. వకీల్ సాబ్ క్రిటిక్స్ ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధించింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల పంపిణీదారులు నష్టపోవాల్సి వచ్చింది కానీ ఇది హిట్టు టాక్ తెచ్చుకున్న సినిమా.
ఇప్పుడు పవన్ నటిస్తున్న సినిమాల్లో భీమ్లా నాయక్ పైనా అభిమానుల్లో అత్యంత ఆసక్తి నెలకొంది. ఇది పవన్ ఇమేజ్ ని పెంచే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకు సాక్ష్యంగా ఇటీవల రిలీజైన మోషన్ టీజర్ సహా పాట యువతరంలో పదే పదే చర్చకు రావడం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న కంటెంట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇకపోతే డేనియల్ శేఖర్ లుక్ రాకతో రానా పాత్ర ఎలా ఉంటుందో అర్థమవుతుంది. పవన్ - రానా ఇద్దరి పాత్రలను కథానుసారం ఆసక్తికరంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. భీమ్లా నాయక్ 12 జనవరి 2022 సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ - రానా కెరీర్ లో ఇది ది బెస్ట్ గా నిలుస్తుందని ఇప్పటికే ఫీలర్స్ కనిపిస్తున్నాయి. సాగర్ చంద్ర పనితనం ఉన్న దర్శకుడు. ఆ స్థాయిలో నిలబెడతాడనే ఆశిస్తున్నారు.