పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ `భీమ్లానాయక్`. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ గత శుక్రవారం భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు నేటివిటీకి అనుగునంగా పవన్ స్టార్ ఇమేక్ ని దృష్టిలో పెట్టుకుని మరింత పవర్ ఫుల్ గా రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు సాగర్ కె. చంద్ర. `భీమ్లానాయక్` బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె. చంద్ర అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ని దక్కించుకుని స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. `భీమ్లానాయక్` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో దర్శకుడు సాగర్ కె. చంద్ర `భీమ్లానాయక్` ప్రాజెక్ట్ పై .. దర్శకుడు త్రివిక్రమ్ పై ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
పవర్ స్టార్ పవర్ కల్యాణ్ తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిగా అభివర్ణించాడు. భీమ్లా విజయాన్ని దర్శకుడిగా వంద శాతం ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. ఈ సినిమా అందించిన ఆనందక్షణాలని అనుభవిస్తున్నానని తెలిపారు సాగర్ చంద్ర. స్టార్ సినిమా చేస్తున్నానని ఉదైనా వొత్తిడికి లోనయ్యారా? అని అడిగితే కెరీర్ లో మరో స్థాయికి చేరుకోవాలంటే వొత్తిడి.. మానసిక సంఘర్షణ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. అయితే అలాంటి పరిస్థితులని గమనించి దానికి అనుగుణంగా ముందు సాగడమే మన ముందున్న ఏకైక మార్గం. అలా సాగినప్పుడే అనుకున్నది సాదించగలం అన్నారు.
`భీమ్లానాయక్` ప్రాజెక్ట్ తనని వెతుక్కుంటూ రావడానికి గల పలు ఆసక్తికర విషయాన్నివెల్లడించారు సాగర్ చంద్ర. నేను 14 రీల్స్ బ్యానర్ లో వరుణ్ తేజ్ తో సినిమా చేయాలనుకున్నాను. అయితే కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది. అదే సమయంలో నిర్మాత నాగవంశీ నాకు ఫోన్ చేశారు.
మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్` చూడమని చెప్పారు. తను అలా ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఇద్దరు హీరోలతో `అప్పట్లో ఒకడుండేవాడు` చిత్రాన్ని చేశాను. అందుకే తను నాకు ఫోన్ చేశానని అనుకున్నాను. వంశీ గారు చెప్పినట్టే సినిమా చూసి తరువాత ఆయనని కలిశాను. ఆ తరువాత సినిమా త్రివిక్రమ్, చినబాబు గార్ల ప్రమేయంతో సెట్స్ పైకి వెళ్లింది`అని చెప్పుకొచ్చారు.
అయితే ఈ సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు సాగర్ చంద్ర. త్రివిక్రమ్ గారు ఫస్ట్ రోజు నుంచి సెట్ లోనే వున్నారని, అయనకు ఏది నచ్చినా వెంటనే ఓకే చెప్పేసేవారని, ఈ ప్రాజెక్ట్ విషయంలో అన్నీ తానై ముందుకు నడిపించారని, డైలాగ్స్ తో పాటు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారని స్పష్టం చేశారు. `భీమ్లానాయక్` ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ లేకుండా ఏదీ జరగలేదని ఈ ప్రాజక్ట్ లో అంతలా ఆయన ఇన్ వాల్వ్ అయ్యారని సాగర్ చంద్ర అసలు విషయం బయటపెట్టారు.