బిచ్చగాడు.. అనువాద చిత్రాల చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. కేవలం రూ.50 లక్షలు ఖర్చు పెట్టి ఈ సినిమాను అనువదించి రిలీజ్ చేస్తే దానికి 50 రెట్లు గ్రాస్ వసూలు చేసి ప్రభంజనం సృష్టించిందీ సినిమా. ఒక సెంటర్లో వంద రోజులాడటమే గగనం అయిపోతున్న ఈ రోజుల్లో.. లెక్కపెట్టలేనన్ని సెంటర్లలో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందీ సినిమా. ఐతే థియేటర్లలో మాత్రమే కాదు.. టీవీ సెట్లలో కూడా ఈ సినిమా ఇదే ప్రభంజనాన్ని కొనసాగించింది. ఇలా థియేట్రికల్ రన్ ఇలా పూర్తయిందో లేదో పోయిన వీకెండ్లోనే జెమిని టీవీలో ఈ సినిమా ప్రిమియర్ షో వేశారు. అవతల మరో ఛానెల్లో ‘సుప్రీమ్’ లాంటి మరో హిట్ మూవీ ఆడుతున్నా సరే.. ‘బిచ్చగాడు’నే హవా సాగించింది.
ఈ చిత్రానికి టీఆర్పీ రేటింగ్ 18.75 రావడం విశేషం. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాల్లో ‘బిచ్చగాడు’ది ఎనిమిదో స్థానం కావడం విశేషం. నందమూరి బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ 24 రేటింగ్ తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత వరుసగా మగధీర (22).. బాహుబలి (21.84).. శ్రీమంతుడు (21.24).. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (20).. అత్తారింటికి దారేది (19.4).. రోబో (19) ఉన్నాయి. ఎనిమిదో స్థానానికి ‘బిచ్చగాడు’ చేరగా.. ఆ తర్వాతి స్థానాల్లో దృశ్యం (18.14).. ఈగ (17.72) ఉన్నాయి. ‘రోబో’ లాంటి భారీ సినిమాను పక్కనబెట్టేస్తే.. ‘బిచ్చగాడు’ లాంటి డబ్బింగ్ సినిమా ఈ జాబితాలో చోటు సంపాదించడం అంటే చిన్న విషయం కాదు. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటు పలికినట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/