అక్కడ పదే.. ఇక్కడ పదిహేను పడ్డాయ్

Update: 2016-10-27 04:26 GMT
డబ్బింగ్ సినిమాల హిస్టరీలోకెల్లా అతి పెద్ద బ్లాక్ బస్టర్ బిచ్చగాడు. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. డైరెక్టు సినిమాలు.. స్టార్ల సినిమాలే థియేటర్లలోకి వచ్చినవి వచ్చినట్లు వెళ్లిపోతుంటే.. ధీమాగా నిలబడి వందరోజులు ఆడేసిందీ డబ్బింగ్ బొమ్మ. అంతేనా.. మొత్తం మీద తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ విజయ్ యాంటోనీ బిచ్చగాడికి ఓ అరుదైన రికార్డ్ కూడా కట్టబెట్టారు.

తమిళ్ లో కేవలం 10+ కోట్ల షేర్ సాధించి హిట్ అనిపించుకున్న పిచ్చైక్కారన్.. తెలుగులో బిచ్చగాడు వచ్చి సర్ ప్రైజ్ హిట్ కొట్టేసింది. ఏకంగా 14.7+ కోట్ల షేర్ వసూలు చేసింది కూడా. ఫుల్ రన్ లో నైజాం 3.10 కోట్లు - సీడెడ్ 3.65 కోట్లు - వైజాగ్ 2.15 కోట్లు - ఈస్ట్ 1.05 కోట్లు - వెస్ట్ 1.10 కోట్లు - కృష్ణా 1.15 కోట్లు - గుంటూరు 1.45 కోట్లు - నెల్లూరు 0.65 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. కర్నాటక-రెస్టాఫ్ వరల్డ్ లో 0.50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం మీద రెండు భాషల్లో 25+ కోట్ల షేర్ వసూళ్లు సాధించి కనీవినీ ఎరుగని విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు బిచ్చగాడు.

తమిళ్ లో కంటే తెలుగులోనే బిచ్చగాడు సంచలనాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది టీవీ టీఆర్పీల విషయంలో కూడా బిచ్చగాడు 18 పాయింట్లకు పైగా సాధించగా.. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ 15 దగ్గర.. మహేష్ బ్రహ్మోత్సవం 8 దగ్గర ఆగిపోయిన సంగతి తెలిసిందే. సినిమా నచ్చితే తనపర బేధాలు లేకుండా తెలుగోళ్లు ఏ రేంజ్ లో ఆదరిస్తారనే దానికి బిచ్చగాడు బెస్ట్ ఎగ్జాంపుల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News