వచ్చే వారం సీత విడుదల కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ రెండోసారి జత కట్టిన ఈ సినిమాకు దర్శకుడు తేజ. ఇప్పటికే ట్రైలర్ ఇందులో ఏదో డిఫరెంట్ గా ఉందన్న అభిప్రాయం కలిగించింది. అనూప్ రూబెన్స్ సంగీతం ఓ మాదిరిగా రిజిస్టర్ అయినట్టు యట్యూబ్ వ్యూస్ ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే రెండు మూడు వాయిదాలు వేసుకున్న సీత ఎట్టకేలకు 24న థియేటర్లలో అడుగు పెడుతోంది.
ఇది మంచి టైం. ఒకపక్క సునామి సృష్టిస్తుందనుకున్న మహేష్ మహర్షి స్టడీగానే ఉన్నప్పటికీ మరీ ఆశించిన అద్భుతాలు అయితే చేయడం లేదు. నిన్న విడుదలైన శిరీష్ ఎబిసిడికి సైతం టాక్ కొంచెం అటు ఇటుగా రావడం కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది. సో సీత వచ్చేనాటికి ఈ రెండు చల్లబడిపోయి ఉంటాయి.
ఈ అవకాశాన్ని సీత ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి. రామాయణం థీమ్ ని తీసుకుని ఇందులో పాత్రల్ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. కాకపోతే సీతను రివర్స్ లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో డిజైన్ చేయడమే కొత్తగా అనిపిస్తున్న పాయింట్. ఒకవేళ కంటెంట్ కనక మెప్పించేలా ఉంటె రన్ బాగుంటుంది.
మహర్షి రెండు వారాలు దాటేసి ఉంటుంది కాబట్టి థియేటర్లు బాగానే దక్కించుకోవచ్చు . టాక్ ఎలా వస్తుంది అనే దాన్ని బట్టే సీత జాతకం ఆధారపడి ఉంటుంది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కాబట్టి తేజ ఫ్యాన్స్ దీని మీద నమ్మకంగానే ఉన్నారు. హాలీవుడ్ మూవీ అల్లాఉద్దీన్ తప్ప పెద్దగా పోటీ లేని సీత ఈ ఛాన్స్ ని ఎంతమేరకు సద్వినియోగపరుచుకుంటుందో చూడాలి