నందమూరి హీరోకు టైం బాగుందే!

Update: 2019-03-05 13:47 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ 118 ఇవాల్టితో ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటిదాకా 5 కోట్ల షేర్ తో ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకుంటూ వీక్ డేస్ కలెక్షన్స్ మీద పెద్ద ఆశలే పెట్టుకుంది. నిజానికి 118కి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే బుకింగ్స్ మంచి జోరు మీద ఉండటమే కాక స్క్రీన్లు కూడా పెరిగేవి. అయితే ఉన్న హాల్స్ లో బాగా ఆడితే చాలని కోరుకోవడం తప్ప ఇప్పటికప్పుడు థియేటర్లలను పెంచే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో  ముమ్మాటికి లేదు.

అన్ సీజన్ అని తప్పించుకోవడానికి లేదు. గత ఏడాది ఇదే నెలలో వచ్చి మంచి వసూళ్లు సాధించిన సినిమాలు ఉన్నాయి. కంటెంట్ ఉండాలే కాని పరీక్షల పేరుతో విద్యార్థులు వాళ్ళ తల్లితండ్రులు దూరంగా ఉన్నా మిగిలిన వర్గాలు వస్తాయిగా.

ఇదలా ఉంచితే 118 ఈ మాత్రం రన్ సాధించడానికి ఇంకొన్ని స్పష్టమైన కారణాలు ఉన్నాయి. గత నెల 8న యాత్ర విడుదలయ్యాక ఒక్కటంటే ఒక్కటి మెప్పించిన సినిమా లేదు.

మహానాయకుడు రెండో రోజే చేతులెత్తేశాడు. అంతకు ముందు ఆ తర్వాత కనీసం ఓసారి చూద్దాం అనుకునే మూవీ ఏదీ రాలేదు. 118 రిలీజైన రోజే అజిత్ విశ్వాసం వచ్చింది కాని దానికి మినిమం బజ్ కూడా లేదు. తమిళ్ లో యాభై రోజులు పూర్తి చేసుకుని ఆన్ లైన్ లో సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉన్న ప్రింట్ పెట్టుకుని అదే పనిగా థియేటర్లకు జనం రమ్మంటే వస్తారా. ఫలితంగా రొటీన్ మాస్ చిత్రమైన విశ్వాసం కనీస జనాన్ని రాబట్టలేకపోయింది. ఒకవేళ బలమైన అపోజిషన్ ఒక్కటి ఉన్నా 118కు వచ్చిన జెన్యూన్ టాక్ కు నిలవడం కష్టమే అయ్యేది. అలా కొన్ని శకునాలు కలిసి వచ్చినప్పుడు సేఫ్ అయ్యే ఛాన్స్ ఒడ్డున పడేస్తుంది.


Tags:    

Similar News