సైకోని ప్రేమించానని బాధపడ్డ బిగ్ బాస్ నటి

Update: 2019-10-05 12:25 GMT
బిగ్ బాస్ రియాలిటీ షో ఇండియాలో ఏ భాషలో అయినా అదరగొడుతుంది. హిందీలో తాజాగా మొదలైన బిగ్ బాస్ 13 ఆసక్తికరంగా సాగుతుంది. అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ప్రేక్షకులను అలరించడానికి చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఒకరికొకరు దగ్గరౌతున్న కంటెస్టెంట్స్ కొంతమంది తమ పర్సనల్ విషయాలను కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. హౌస్  మేట్స్ లో ఒకరైన కోయినా మిత్రాను మిగిలిన కంటెస్టెంట్స్ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అని అడగ్గా ఆమె తన లైఫ్ లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను మిగిలిన వాళ్లతో పంచుకుంది.

కొన్నేళ్ల క్రితం తాను టర్కీకి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని, అతను కూడా మొదట్లో తనను చాలా ప్రేమగా చూడేవాడని ఆ తర్వాతే తనకి టార్చర్ మొదలైందని  ఆమె వాపోయింది. అతను చాలా పోసిసివ్ గా ఉండేవాడని, కొద్దీ రోజుల్లోనే అతని ప్రవర్తనలో విపరీతంగా తేడా వచ్చిందని చెప్పింది. పెళ్లయ్యాక టర్కీలో ఉండమనేవాడని, నన్ను ఎలా చూసుకుంటావ్ అని అడిగితె ముందు తన పాస్ పోర్ట్ కాల్చేస్తానని, అతని తల్లిదండ్రులతోనే కలిసి ఉండాలని, టర్కీ దాటి ఎక్కడికి వెళ్లనివ్వనని అన్నాడని ఆమె చెప్పింది.

అంతేకాకుండా ముంబైలో తాము ఇద్దరం కలిసి ఉండేటప్పుడు తనను ఏ పని చేయడానికి వీల్లేదని, బయటకి రానిచ్చేవాడు కాదని, ఒకసారి నన్ను బాత్ రూమ్ లో పెట్టి తాళం వేసి సైకోలా ప్రవర్తించాడని బాధగా చెప్పింది. ఇంక అతని బిహేవియర్ తో విసిగిపోయానని అందుకే మా మధ్య బంధాన్ని అప్పుడే తెంచేసుకున్నానని ఆమె భావోద్వేగానికి గురైంది. 

Tags:    

Similar News