ఇంతింతై అన్న చందంగా ఆదాయాన్ని పెంచుకోవడంలో క్రీడాకారుల్లో ది బెస్ట్ ఎవరు? అంటే టీమిండియా కెప్టెన్ కోహ్లీ పేరు మార్మోగిపోతోంది. ఓవైపు వరుస విజయాలతో టీమిండియా క్రేజు పెంచుతున్న కోహ్లీకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ప్రముఖ కార్పొరెట్ కంపెనీలు అతడితో భారీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తమ ఉత్పత్తికి విలువ పెంచే బ్రాండ్ అంబాసిడర్ గా అతడితో ప్రచారం కోసం కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. ఆ కోవలో ఇప్పటికే విరాట్ కోహ్లీ `ప్యూమా కంపెనీ`తో ఎనిమిదేళ్లకు 100 కోట్ల ఒప్పందం చేసుకున్నాడు. 2017లోనే డీల్ మొదలైంది.
కోహ్లీ తర్వాత మళ్లీ ఆ రేంజులో డీల్ కుదుర్చుకున్న ఏకైక క్రీడాకారుడు/ క‌్రీడాకారిణి ఎవరు? అని వెతికితే .. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు (పి.వి.సింధు) పేరు కనిపిస్తోంది. పీవీ సింధు బ్యాడ్మింటన్ దిగ్గజంగా వరల్డ్ వైడ్ పాపులరైంది. ఒలింపిక్ మెడల్ విజేతగా తన పాపులారిటీ స్కైలో ఉంది. సింధు తనకు ఎంత క్రేజు వచ్చినా - అందుకు తగ్గట్టే కఠోరంగా శ్రమించి తన బ్రాండ్ వ్యాల్యూని అంతే ఇదిగా పెంచుకోవడంలో సక్సెసైంది. ఈ రెండేళ్లలోనే తన ముఖ విలువ అమాంతం పెరిగింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచింది.
తాజా ఇన్ఫో ప్రకారం... పి.వి.సింధు ప్రఖ్యాత చైనీ స్పోర్ట్స్ పరికరాల కంపెనీ- లి నింగ్ తో ఓ భారీ డీల్ కుదుర్చుకుందిట. ఈ సంస్థకు ప్రచారకర్తగా కేవలం నాలుగేళ్లకే రూ.50కోట్లు సింధుకి ముడుతోంది. అంటే విరాట్ ఎనిమిదేళ్లలో అందుకున్న దాంట్లో సగం అన్నమాట. అది కూడా నాలుగేళ్లలోనే ఇంత పెద్ద మొత్తం అందుకోబోతోంది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచాక ప్రపంచవ్యాప్తంగా సింధుకి అభిమానులు ఏర్పడ్డారు. యూత్ తనని స్ఫూర్తివంతమైన క్రీడాకారిణిగా చూస్తోంది. అందుకు తగ్గట్టే తన ఆటను సింధు అంతకంతకు మెరుగుపరుచుకుంటూ స్థిరంగా రాణిస్తోంది. ప్రఖ్యాత యోనెక్స్ సంస్థ ఏడాదికి 12.5 కోట్లు చెల్లిస్తూ తనని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు. 2016లో ఈ డీల్ 3.5కోట్లుగా ఉండేది. కేవలం రెండేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది రేంజు. అంటే సింధు తనని తాను ఇంతింతై అన్న చందంగా ఎలివేట్ చేసుకున్న తీరు అమోఘం అని ప్రశంసించి తీరాలి. కోహ్లీ రేంజులో ఆర్జిస్తూ తెలుగమ్మాయ్ ఔరా! అనిపిస్తోంది కదూ?