ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. ఎప్పుడు తీశారో కూడా తెలియని ఈ మూవీ టీజర్, ట్రైలర్ తో ఆసక్తి కలిగించగా ఫిబ్రవరి 12న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో సినిమాని నెక్స్ట్ లెవల్ లో ఉంచింది. డీజే టిల్లు సినిమాని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో సిద్ధు వెంటనే డీజే టిల్లు సీక్వెల్ కూడా మొదలు పెట్టాడు.
టిల్లు స్వేర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ మారిపోయాడు. విమల్ కృష్ణ బదులుగా మల్లిక్ రామ్ టిల్లు స్వేర్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఏదో ఒక న్యూస్ వార్తల్లో నిలుస్తోంది. సినిమాలో ముందు శ్రీ లీలని హీరోయిన్ గా అనుకోగా ఆమె ఎందుకో ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. ఆ తర్వాత అనుపమ ఓకే అవగా ఆమె కూడా కొన్ని కారణాల వల్ల చేయనన్నది. మలయాళ భామ మడోన్నాని తీసుకోగా ఆమె కూడా సినిమా వదిలేసింది. ఇక చివరగా హిట్ 2 భామ మీనాక్షి చౌదరి ఈ ప్రాజెక్ట్ కి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే టిల్లు కథని బాలీవుడ్ కి తీసుకెళ్లాలని చూస్తున్నారు మేకర్స్. డీజే టిల్లు పరిస్థితి ఏమో కానీ టిల్లు స్క్వేర్ ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం నిర్ణయించలేదు. బాలీవుడ్ యువ హీరో మాస్ ఇమేజ్ ఉన్న హీరో కోసం వెతుకుతున్నారట.
టిల్లు స్క్వేర్ హిందీ రీమేక్ అనగానే ఆ ఛాన్స్ అందుకోవాలని అక్కడ హీరోలు పోటీ పడుతున్నారని తెలుస్తుంది. ఇంతకీ బాలీవుడ్ లో టిల్లు స్క్వేర్ ఎవరు చేస్తారు.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ కథతోనే టిల్లు స్క్వేర్ కూడా వస్తుంది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవగానే కుర్రాడిలో కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగినట్టుగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ లో టిల్లు స్క్వేర్ రీమేక్ విషయాలను త్వరలో వెల్లడిస్తారని తెలుస్తుంది. మరి బాలీవుడ్ లో ఈ టిల్లు గాడి హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.