బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన హిందీ బిగ్ బాస్ షో విజయవంతంగా 10 సీజన్ లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 10 వ సీజన్ నుంచి హౌస్ లోకి సామాన్యులకు కూడా ఎంట్రీ కల్పించారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇపుడు అదే తరహాలో బిగ్ బాస్ 11 కూడా సేమ్ కాన్సెప్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ 11 కు సంబంధఙంచిన మొదటి టీజర్ ను విడుదల చేశారు. పడోసీ(ఇరుగు పొరుగు వాళ్లు )లతో ఎలా మెలగాలో తెలియజేస్తున్నట్లు సాగే ఈ ట్రైలర్ లో సల్లూ భాయ్ తనదైన డైలాగ్ డెలివరీతో ఎంటర్ టైన్ చేశాడు. ఈ టీజర్ లో సల్లూభాయ్ పెళ్లి గురించి పక్కింటావిడ అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తోంది.
బిగ్ బాస్ 10 తరహా కాన్సెప్ట్‌తోనే `బిగ్‌బాస్ 11` ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మొదటి టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలన్న విషయాన్నిసల్మాన్ ఖాన్ వివరిస్తున్నట్లు చూపించారు. పడోసీ కాన్సెప్ట్ తోనే ఈసారి బిగ్‌బాస్ ఇంట్లో సెలబ్రిటీలు, సామాన్యులు పక్కపక్క ఇళ్లలో నివసించనున్నట్లు తెలుస్తోంది. తన బాల్కనీలోని మొక్కలకు సల్లూభాయ్ నీళ్లు పోస్తుండగా, అవి కింద పేపర్ చదువుతున్న ఓ ముసలాయన చేతిలోని టీ కప్పులో పడతాయి. ఆయన సల్లూ భాయ్ చేసిన పనికి కేకలు వేస్తాడు. ఇది గమనించి పక్కింటావిడ త్వరగా పెళ్లి చేసుకుంటే ఈ తిప్పలు తప్పుతాయిగా...అంటూ సెటైర్ వేస్తుంది. దానిక సల్మాన్ ఏమాత్రం తడబడకుండా....మీరు సింగిల్ గా ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడినే అంటూ కౌంటర్ ఇస్తాడు. ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి మిమ్మల్ని అలరించేందుకు బిగ్ బాస్ 11 త్వరలో మీ ముందుకు రాబోతోందంటూ సల్మాన్ ఈ ట్రైలర్ ను ముగిస్తాడు. అక్టోబర్ 1 నుంచి ఈ కార్యక్రమం `కలర్స్` ఛానల్లో ప్రసారం కానుంది. ఇందులో పాల్గొనబోయే వారి వివరాలు తెలియాల్సి ఉంది.