బిగ్ బాస్ 6 విన్నర్.. గూగుల్ ఫిక్స్ అయ్యింది!

Update: 2022-12-14 05:30 GMT
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ తుది దశకు చేరుకుంటున్న కొద్ది ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఈసారి సీజన్లో అత్యధిక మంది పాల్గొన్న విషయం తెలిసిందే. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగానే ఇప్పుడు 6 మంది మిగిలారు. ఇక బుధవారం రోజు ఎలిమినేషన్ జరగనుంది. దీంతో టాప్ ఫైవ్ లో నిలిచే వారిలో ఎవరు బిగ్ బాస్ టైటిల్ను గెలుచుకుంటారు అనేది ఆదివారం తెలియనుంది.

ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ కూడా చాలా కీలకం కానుంది. ఈ నాలుగు రోజులపాటు కూడా బిగ్ బాస్ భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకునే అవకాశం కూడా ఉంది. నాగార్జున ఏ విధంగా టైటిల్ విన్నర్ ను ప్రకటిస్తాడు అనేదానికోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతిసారి కూడా విన్నర్ ఎవరు అనే విషయంలో జనాల్లో ముందుగానే ఒక క్లారిటీ రావడం కూడా కామన్ గా మారిపోయింది.

ఇక ఈసారి రేవంత్ కప్ గెలుస్తాడు అని కూడా టాక్ అయితే గట్టిగానే వినిపించింది. కానీ అతనికి పోటీగా మరొక కంటెస్టెంట్ కూడా ఉండడంతో ఇప్పుడు గూగుల్లో అతని పేరు కనిపిస్తూ ఉండడం మరింత వైరల్ గా మారుతుంది. గూగుల్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ ఎవరు అని సెర్చ్ చేస్తే రోహిత్ సహ్ని పేరు కనిపిస్తుంది.

ఎక్కువగా అతని పేరు వైరల్ కావడంతో ఇప్పుడు గూగుల్ తల్లి అయితే రోహిత్ పేరును చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఒక విధంగా రోహిత్ అయితే అంతా తీసి పారేసే మెటీరియల్ ఏం కాదు. అతను ఇంతవరకు వచ్చాడు అంటే మేటర్ ఉంది అని లెక్క. తప్పకుండా ఫైనల్లో పోటీని ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక శ్రీహాన్ ఆదిరెడ్డి కూడా టాప్ 5 లో ఎలా నిలదుక్కుకుంటాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ఇక ఇప్పుడు హౌస్ లో మిగిలింది కేవలం ఇద్దరూ అమ్మాయిలు మాత్రమే. ఒకరు కీర్తి మరొకరు శ్రీ సత్య. మరి ఈ ఇద్దరిలో అయినా ఒకరు గెలిచి బిగ్ బాస్ తెలుగు టైటిల్ అందుకుంటారో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News