ఉత్కంఠ భరితమైన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ముగిశాక...బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ వివిధ లెవెల్లో జరగనుంది. చివరి లెవెల్లో గెలిచిన వారికి మెడాలియన్ లభిస్తుంది. దాని వల్ల ఆ సభ్యునికి ‘ఇమ్యూనిటీ’ దొరుకుతుంది. అయితే ఈ టాస్క్ లో ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళిన మహేశ్, రాహుల్, వరుణ్, పునర్నవిలు పాల్గొలేరు. నామినేషన్ టాస్క్ లో గెలిచిన అలీ - బాబా భాస్కర్ - శివజ్యోతి - వితికాలతో పాటు కెప్టెన్ శ్రీముఖి మెడాలియన్ టాస్క్ మొదటి రౌండ్లో పోటీపడ్డారు.
టాస్క్ ప్రకారం ట్యాప్ ల నుండి బకెట్ లలో నీళ్లు పట్టుకుని వారికి ఇచ్చిన డ్రమ్స్ నింపాల్సిఉంటుంది. గేమ్‌లో లేని రాహుల్ - మహేష్ - వరుణ్ లు నచ్చిన వాళ్ళకు సాయం చేయవచ్చు లేదా.. నచ్చని వాళ్ళు నీళ్లు నింపకుండా అడ్డుకుని బకెట్లని కింద పడేయొచ్చని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ సంచాలక్ గా పునర్నవిని పెట్టారు. ఇక టాస్క్ బజర్ మ్రోగడమే గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు ట్యాప్ ల్లో వితికా - శ్రీముఖి - శివజ్యోతి - బాబా - అలీలు నీళ్ళు పట్టుకుని డ్రమ్స్ నింపే ప్రయత్నం చేశారు.
ఇక్కడ మొదటి నుంచి స్నేహితులుగా ఉన్న రాహుల్ -వరుణ్ వితికాని గెలిపించడానికి కుమ్మక్కయ్యరు. వరుణ్-అలీ - శ్రీముఖి పట్టుకున్న నీళ్ళ బకెట్లని పడేయటానికి ప్రయత్నిస్తే - రాహుల్ దారుణంగా బాబా భాస్కర్ ని టార్గెట్ చేసి, ఆయన వాటర్ బకెట్ ని అనేక సార్లు పడగొట్టాడు. అయిన సరే బాబా ఓర్పు పట్టి మళ్ళీ వాటర్ నింపే ప్రయత్నం చేశాడు. ఇక అలీ వీరి స్ట్రాటజీని గమనించి శివజ్యోతి డ్రమ్ లో కూడా వాటర్ పోశాడు. దీంతో శ్రీముఖి-అలీ మధ్య వివాదం చెలరేగింది. ఎవరు గేమ్ వారు ఆడాలని - ఇలా చేస్తే గేమ్ ఎందుకని శ్రీముఖి ఫైర్ అయింది.
దీంతో సంచాలక్ గా ఉన్న పున్నూ జరిగిన విషయాన్ని బిగ్ బాస్ కు చెప్పింది. బిగ్ బాస్ అలీ - శివజ్యోతిలని గేమ్ నుంచి డిస్ క్వాలిఫై చేశాడు. ఇక శ్రీముఖి -వితికా - బాబా మాత్రమే గేమ్ ఆడారు. ఈ క్రమంలోనే బాబాని రాహుల్ అడ్డుకోగా - శ్రీముఖిని వరుణ్ అడ్డుకున్నాడు. చివరి బజర్ మ్రోగిసరికే వితికా డ్రమ్ లో ఎక్కువ నీళ్ళు ఉండటంతో, తాను విన్నర్ గా నిలిచి బాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ చివరి రౌండుకు నేరుగా చేరుకుంది.