ఆకతాయికి బుద్ధి చెప్పిన బిబి స్టార్

Update: 2020-07-10 10:30 GMT
సౌత్ లో గత మూడు సంవత్సరాలుగా బిగ్ బాస్ రియాల్టీ షో జరుగుతోంది. ఇప్పటి వరకు అన్ని భాషల్లోకి అత్యధికంగా తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన ఓవియ ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ ఎంతో మంది అభిమానం ను చురగొన్న ఓవియ మరోసారి తన తెగువను కనబర్చింది.

ఇటీవల ఈమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తుండగా ఒక ఆకతాయి ఇప్పుడే నేను హస్తప్రయోగం చేశానంటూ కామెంట్ పెట్టాడు. ఇలాంటి మెసేజ్ లను అందరూ కూడా స్కిప్ చేస్తారు. కానీ ఓవియ స్పంచింది. అతడి గురించి అందరికి తెలియాలని ఉద్దేశ్యంతో "నీకు అది మంచిదే" అంటూ సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం కు అంతా కూడా షాక్ అయ్యారు. అతడికి సరైన సమాధానం ఇచ్చిన నీ ఘట్స్ కు హ్యాట్సాప్ అంటూ ఆమెను పలువురు ప్రశంసించారు.
Tags:    

Similar News