ఏ ముహుర్తంలో మొదలైందో కానీ తమిళ బిగ్ బాస్ మొదలైన నాటి నుంచి సంచలనాల మీద సంచలనాలు నమోదు అవుతున్నాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి.. ఇప్పటికే ఫిర్యాదులు..కేసులు.. కోర్టులు అన్నవి తమిళ బిగ్ బాస్‌కు కామన్ గా మారిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళ బిగ్ బాస్ లో ఒక హౌస్ మేట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పెను దుమారాన్ని రేపుతోంది.
ఈ వ్యవహారం బయటకు రావటంతో బిగ్ బాస్ హౌస్ వద్దకు పోలీసులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోందన్న అంశంపై ఆ షో నిర్వాహకుల్ని పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సూసైడ్ కు సంబంధించి బయటకు వచ్చిన న్యూస్ మొత్తం ఫేక్ అన్న మాట వినిపిస్తోంది.
అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఆరాచక వాతావరణం నెలకొందన్న విమర్శ మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన బిగ్ బాస్ షోలో.. హౌస్ మేట్ల మధ్య పోటీ పెంచటం.. షో టీఆర్పీ రేటింగ్ పెంచటానికి వీలుగా చేసే చేష్టలు కొన్ని మరీ ఇబ్బందికరంగా మారాయని చెబుతున్నారు. ప్రేక్షకుల్లో మరింత కిక్కు పెంచటానికి.. షోకు ఆదరణను అంతకంతకూ పెంచేందుకు వీలుగా డ్రామాను పెంచే పనిలో భాగంగా మసాలాను మరింత పెంచేస్తున్నారన్న అపవాదు కూడా బిగ్ బాస్ షో మీద ఉంది.
తమిళ బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ మీద..పలువురు మండిపడుతున్నారు కూడా. ఫ్యామిలీ వాల్యూస్‌ను దెబ్బ తీసేలా బిగ్ బాస్ షో ఉందన్న మాట వినిపిస్తోంది. టీఆర్పీ రేటింగ్ పెంచేందుకు .. షోలో ఇంటిమేట్ సీన్లు కూడా కొన్ని తీసుకొస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనలో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తమిళ బిగ్ బాస్ తో పోలిస్తే.. తెలుగు బిగ్ బాస్ కాస్తంత కూల్ గా నడుస్తుందనే చెప్పాలి. అక్కడున్నంత రచ్చ తెలుగు బిగ్ బాస్ లో లేదు. ఈ మధ్యనే ప్రిన్స్ సర్ ప్రైజ్ కిస్ తప్పించి ఇప్పటివరకూ ఎలాంటి అభ్యంతరకర సీన్లు లేవన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో షోకు మరింత ఆదరణ పెంచేందుకు మసాలా యాడ్ చేస్తే మాత్రం వివాదాలు పక్కా అంటున్నారు. అయినా.. రియాల్టీ షోలో ఈ రచ్చ అంత అవసరమంటారా బిగ్ బాస్?
Full View