బిగ్ బాస్-4 సీజన్ ముగిసి నెల దాటింది. వారి గేమ్, గ్రాండ్ ఫినాలే సంగతులు.. కంటిస్టెంట్లకు వచ్చిన ఆఫర్లు.. ఇలా అన్నింటిపై డిస్కషన్ నడిచిపోయింది. ఇక సైలెంట్ అవుతున్న తరుణంలో మరోసారి బిగ్ బాస్ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. అది మామూలుగా కాదు.. ఓ రేంజ్ లో! ఇంతకీ ఏం జరుగుతోంది?
లేటెస్ట్ గా రిలీజైన ఫొటోలు చూస్తుంటే.. ‘బిగ్ బాస్ రీ యూనియన్’ పేరిట ఈవెంట్‌ను ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకుంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ ఒక చోట చేరారు. అది కూడా ఒక సీజన్ వాళ్లు కాదు.. గత మూడు సీజన్ల కంటెస్టెంట్లు కలిసి కనిపించారు.
ఇక, మూడు సీజన్ల విన్నర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. దీంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే.. వీళ్లంతా ఎందుకు కలిశారన్నది మాత్రం తెలియడం లేదు. కాసేపటి కిందనే కౌశల్ కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో భాను శ్రీ, గీతా మాధురి, సామ్రాట్, దీప్తి నల్లమోతు వంటి వారున్నారు. ఈ ఫొటోలకు ‘బిగ్ బాస్ రీ యూనియన్’ అని ప్రకటించాడు కౌశల్.
వీరి ఫొటోలు సందడి చేస్తుంటే.. ఇక, గత సీజన్ విన్నర్స్ కూడా ఒక్కచోట చేరి స్టిల్స్ ఇచ్చారు. మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ, రెండో సీజన్ విజేత కౌశల్, మూడో సీజన్ గెలుపు గుర్రం రాహుల్ సిప్లిగంజ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. వీరి బ్యాక్ గ్రౌండ్‌లో బిగ్ బాస్ కన్ను బొమ్మ ఉంది. దీంతో.. వీరు క్యాజువల్ గా కలిసిన ఈవెంట్ కాదని, స్టార్ మా ఏదో ప్లాన్ చేస్తోందనే విషయం కన్ఫామ్ అవుతోంది. మరి, అదేంటన్నదే క్వశ్చన్ మార్క్. అయితే.. ఇందులో నాలుగో సీజన్ కంటిస్టెంట్లు ఒక్కరు కూడా కనిపించకపోవడం గమనార్హం. మరి, వీరు ఏం చేయబోతున్నారు అనేది తెలియాలంటే.. కాస్త వెయిట్ చేయాల్సిందే.