'బిగ్ బాస్ - 4' ఎన్ని రోజులు ఉండబోతోంది...?

Update: 2020-06-25 06:00 GMT
తెలుగులో బుల్లితెరపై అత్యంత విజయవంతమైన రియాలిటీ గేమ్ షో లలో 'బిగ్‌ బాస్‌' కూడా ఒకటి. తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్స్ రాగా ఇప్పుడు నాలుగో సీజన్ కోసం అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. కాగా తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. సీజన్ 2కు నేచులర్ స్టార్ నాని, సీజన్ 3కి టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. స్మాల్ స్క్రీన్ పై అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా నిలిచింది సీజన్ 3. ఇక 'బిగ్ బాస్' 4వ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. తెలుగులో మూడు సీజన్స్ సక్సెస్ అవడంతో బిగ్‌ బాస్ తెలుగు రియాలిటీ షోకు అటు ప్రేక్షకుల్లో ఇటు సెలబ్రిటీస్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో త్వరలో మొదలయ్యే ఈ షోలో కంటెస్టెంట్స్‌ గా ఈసారి మరింత స్టార్ క్యాస్ట్ యాడ్ చేసే అవకాశం ఉంది. ఈ షోలో పాల్గొన్న నటీనటులు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలకు బ్రహ్మండమైన పాపులారిటీ లభించిన సంగతి తెలిసిందే. 'బిగ్ బాస్' సీజన్-1 లో శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. సీజన్ 2 మరియు సీజన్ 3లలో కౌశల్ మండా మరియు రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుపొందాడు.

కాగా ఇప్పటికే సీజన్ - 4 కి సంభందించిన అన్ని పనులు పూర్తవ్వాల్సి ఉండగా కరోనా వచ్చి అంతరాయం కలిగించింది. ఫస్ట్ సీజన్ కి పూణే లో బిగ్ బాస్ హౌస్ సెట్ వేసిన నిర్వాహకులు తర్వాతి రెండు సీజన్స్ కి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ హౌస్ నిర్మించడం స్టార్ట్ చేసారు. వ్య‌క్త‌గత భౌతిక దూరం పాటిస్తూనే బిగ్ బాస్ 4 కి స‌న్నాహాలు చేస్తున్నారట నిర్వాహకులు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజ‌న్ 4 ఈసారి 50 రోజులు మాత్ర‌మే ఉండ‌బోతుందని సమాచారం. లాస్ట్ సీజన్ 100 రోజులు ఉండగా ఈ సీజన్ మాత్రం 50 రోజులకే పరిమితం చేయనున్నారట. అంతేకాకుండా ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులను ఈ షోలో పార్టిసిపేట్ చేయించడానికి 'స్టార్ మా' వారు చేయాల్సిన అన్ని ప‌నులు చేస్తున్నారట. అయితే సినీ సెలబ్రిటీలు మాత్రం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నార‌ట. అయితే బ‌య‌ట‌ ఉండటం కంటే 'బిగ్ బాస్' హౌస్ లోనే సేఫ్ అనే గాలం వేస్తున్నారట నిర్వాహకులు. తాజాగా బుల్లితెరపై ఫేమస్ అయిన బిత్తిరి స‌త్తిని 'స్టార్ మా' వారు బిగ్ బాస్ - 4 కోసం సంప్ర‌దించిన‌ట్లుగా స‌మాచారం. ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవబోయేది నిర్వాహకులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Tags:    

Similar News