#BIGGBOSS5TELUGU E26 : శ్రీరామ్ కెప్టెన్.. సన్నీని కార్నర్ చేసి పొడిచేశారు
నాల్గవ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మరియు కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. గెలవాలంటే తగ్గాలి టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు రెండు రోజులు ఆహారం తీసుకోకుండా టాస్క్ లో పాల్గొన్నారు. కొందరు చివర్లో తినగా సన్నీ.. మానస్.. శ్రీరామ చంద్ర మరియు హమీదా ఇంకా షణ్ను ఇంకా సిరిలు ఆహారం తీసుకోకుండా టాస్క్ ముగిసే వరకు ఉన్నారు. ఈ టాస్క్ లో అత్యధిక బరువు తగ్గిన జట్టుగా సన్నీ మరియు మానస్ లు నిలిచారు. ఆ తర్వాత స్థానంలో శ్రీరామ చంద్ర ఇంకా హమీదాలు కూడా బరువు తగ్గారు. ఆ తర్వాత శ్వేత మరియు యానీ మాస్టర్ లు నిలిచారు. ఈ మూడు జంటల్లో ఒకొక్కరు చొప్పున కెప్టెన్సీ పోటీ దారులుగా రావాలంటూ బిగ్ బాస్ సూచించాడు. ఆ సమయంలో శ్రీరామ చంద్ర.. సన్నీ మరియు శ్వేతలు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. ఈ ముగ్గురిలో ఎవరిని కెప్టెన్ గా ఎన్నుకుంటారో ఇంటి సభ్యులు నిర్ణయించాలంటూ కత్తులు బిగ్ బాస్ ఇచ్చాడు. ఎవరికి అయితే తక్కువ కత్తులు వస్తాయో వారే ఈ వారం కెప్టెన్ అంటూ ప్రకటించారు. తక్కువ కత్తులు శ్రీరామ చంద్రకు రావడంతో బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్ శ్రీరామ చంద్రగా నిలిచాడు. ఈ క్రమంలో సన్నీని ఇంటి సభ్యులు అంతా కూడా కార్నర్ చేశారు. ఫిజికల్ టాస్క్ అనుకుని సన్నీ చేసేందుకు సిద్దం అయిన సమయంలో ఇంటి సభ్యులు అంతా కూడా ఆయన్ను పొడిచేశారు.
తాజా ఎపిసోడ్ గెలవాలంటే తగ్గాలి టాస్క్ లో భాగంగా శ్వేత పవర్ రూమ్ యాక్సెస్ ను దక్కించుకుంటుంది. శ్వేత మరియు యానీ మాస్టర్ లు పవర్ రూమ్ లో షణ్ను మరియు సిరిలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ టాస్క్ లో భాగంగా చిక్కు ముడులు విప్పాలి. ఆరు చిక్కులు పడి ఉన్న తాడును విప్పి జాగ్రత్తగా మెలికలు లేకుండా అవతలి వైపు ఉన్న స్టాండ్ కు తగిలించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఈ టాస్క్ లో శ్వేత మరియు యానీ మాస్టర్ వారు గెలిచారు. అప్పటికే ఒక టాస్క్ లో శ్రీరామ చంద్ర గెలవడం.. ఆ తర్వాత సన్నీ కూడా గెలవడం వల్ల పోటీ అనేది ఈ మూడు జట్ల మద్య ఏర్పడింది. మూడు జట్లలో ఒకొక్కరు ముందుకు రావాలంటూ చెప్పిన సమయంలో చాలా చర్చలు జరిగాయి. యానీ మరియు శ్వేతలు టాస్ వేశారు. ఆ టాస్ లో శ్వేత గెలిచింది. శ్వేత కెప్టెన్సీ పోటీ దారుగా ఉంది. ఆ తర్వాత శ్రీరామ చంద్ర మరియు హమీదాలు మాట్లాడుకుని ఖచ్చితంగా నాకు ఇమ్యూనిటీ కావాలి కనుక నాకు ఛాన్స్ ఇవ్వమంటూ హమీదాను అడిగాడు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పింది. హమీదా కు రేషన్ మేనేజర్ గా అవకాశం ఇస్తానంటూ శ్రీరామ్ చెప్పాడు. ఇక చివరగా సన్నీ మరియు మానస్ లు చాలా సమయం చర్చించుకుని చివరకు సన్నీ రిక్వెస్ట్ మేరకు మానస్ త్యాగం చేశాడు. దాంతో కెప్టెన్సీ కోసం శ్రీరామ చంద్ర.. శ్వేత మరియు సన్నీలు నిలిచారు.
ఈ ముగ్గురు కూడా తాము కెప్టెన్ గా అయితే ఏం చేస్తాము అనే విషయాన్ని చెప్పారు. వీరి నడుముకు ఒక బెల్టు కట్టి ఇంటి సభ్యులు అంతా కూడా ముగ్గురిలో ఎవరు కెప్టెన్ కావాద్దు అని కోరుకుంటున్నారో తెలియజేసి కత్తిని అతడి బెల్ట్ కు గుచ్చాల్సి ఉంటుంది. సన్నీకి చాలా మంది కత్తి గుచ్చారు. విశ్వ.. లోబో.. కాజల్.. షణ్ను.. సిరి ఇంకా కొందరు కూడా సన్నీకి కత్తి గుచ్చారు. దాంతో ఆట మద్యలో ఉన్న సమయంలోనే సన్నీ కెప్టెన్సీ బరిలో లేనట్లే అనుకున్నారు. ఆ తర్వాత శ్వేత మరియు శ్రీరామ చంద్రల మద్య పోటీ రసవత్తరంగా ఉన్న సమయంలో కాజల్ శ్వేతకు కత్తి పొడిచింది. దాంతో శ్రీరామ చంద్రకు లీడ్ వచ్చేసింది. శ్రీరామ చంద్ర కు జెస్సీ చివర్లో గుచ్చినా కూడా అప్పటికి కూడా శ్రీరామ చంద్ర వద్ద తక్కువ కత్తులు ఉన్నాయి. దాంతో బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్ గా శ్రీరామ చంద్ర నిలిచినట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు. శ్రీరామ చంద్ర కెప్టెన్ అయిన తర్వాత ఇంటి సభ్యులు అంతా ఆ విషయమై చర్చించుకుంటూ ఉండగా ఎపిసోడ్ ముగిసింది. తదుపరి ఎపిసోడ్ లో వీక్ లో చెత్త పర్ఫార్మర్ ఎవరు అనే విషయాన్ని నిర్ణయించి జైల్లో వేయాల్సి ఉంటుంది.