ఇలయదళపతి విజయ్ నటించిన చిత్రాలన్నీ తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధిస్తూ క్రేజ్ ని స్కై హైకి చేరుస్తున్నాయి. తాజాగా అతడు నటిస్తున్న `బిగిల్` సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. తేరి- మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన అట్లీ కుమార్ దర్శకత్వంలో కల్పాతి ఎస్ అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా బిగిల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ అంచనాల్ని మించి ఉందని చెప్పాలి. ఇందులో విజయ్ మూడు డిఫరెండ్ గెటప్ లలో కనిపిస్తున్నాడు. ఫుట్ బాల్ కోచ్ గా, ఫుట్ బాల్ ఆటగాడిగా, వీధి రౌడీగా మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించడం ఆకట్టుకుంటోంది.
విజయ్ లుక్స్ పరంగా మేకోవర్ ఆకట్టుకుంది. ఓ పాత్ర క్లాసీగా.. ఇంకో పాత్ర మాసీగా వుంది. విజువల్ గ్లింప్స్ ఉన్న ట్రైలర్ ఇది. యాక్షన్ సీక్వెన్సెస్ ట్రెర్రిఫిక్. సినిమాలోని కీలకమైన పాత్రల్ని2 నిమిషాల 41 సెకండ్ల నిడివి గల ట్రైలర్ లో పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. బాలీవుడ్ బాద్ షా నటించిన `చక్ దే ఇండియా`కు రీమేక్ గా ఈ చిత్రాన్నితనదైన స్టైల్లో మార్పులు చేర్పులు చేసి కొత్త పంథాలో అట్లీ ఈ చిత్రాన్ని ఫ్రెష్ మూవీగా తెరపైకి తీసుకొచ్చాడు. హాకీ నేపథ్యంలో చక్ దే చిత్ర కథ నడుస్తుంది. అందుకే మేకర్స్ ఆ చిత్రాన్ని మహిళా హాకీ ప్లేయర్స్ కి అంకితం ఇచ్చారు అప్పట్లో. `చక్ దే ఇండియా`లోని ఫ్లాష్ బ్యాక్ ని పూర్తిగా మార్చి బిగిల్ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళికి తెలుగు- తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ లో నయన్ గ్లింప్స్ మైమరిపించింది. మహిళా టీమ్ కోచ్ గా విజయ్ వర్కింగ్ స్టైల్ ని కమర్షియల్ ఎలివేషన్ తో చూపించడం విశేషం.
సరైన ప్రచారం లేకపోవడంతో బిగిల్ కి టాలీవుడ్ సర్కిల్స్ లో పెద్దగా పాపులారిటీ రాలేదు. అయితే అనువాద చిత్రాలకు సరిగ్గా రిలీజ్ ముందు రోజు ప్రచారం చేయడం మన నిర్మాతలకు అలవాటు. అందుకు తగ్గట్టే అవి ఇలా వచ్చి అలా వెళుతుంటాయి. బహుశా బిగిల్ కి అలాంటి సన్నివేశం లేకుండా జాగ్రత్తపడతారేమో చూడాలి. తమిళంలో ఈనెల 27న రిలీజ్ అని ప్రకటించారు. తెలుగులోనూ సైమల్టేనియస్ రిలీజ్ చేస్తారని ప్రచారమైంది. మరి ఈ 10రోజుల్లోనే ఎంతగా ప్రచారం చేస్తారు? అన్నది చూడాలి.
Full View