తాప్సి తెలుగు లో హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఇక్కడ లక్ కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అదృష్టం ఆమెకు అనూహ్యంగా ఆఫర్లు తెచ్చి పెట్టింది. అక్కడ స్టార్ హీరోయిన్ అవ్వలేక పోయినా కూడా వరుసగా సినిమాలు చేసేంత బిజీగా మాత్రం ఆమె ఉంది. కంటిన్యూగా ఆమె సినిమాలు విడుదలకు సిద్దం అవుతూనే ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఆమెను మోస్ట్ వాంటెడ్ అంటున్నారు. భిన్న విభిన్నమైన పాత్రలను తాప్సి చేస్తూ బాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందాలు ప్రదర్శణ చేసేందుకు బికినీ షో చేయడంతో పాటు.. వివాహిత పాత్రలో చీర కట్టులో కనిపించడం మొదలు ప్రతి ఒక్క లుక్ ను కూడా ఆమె సాధ్యం అయినంత నాచురల్ గా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈమె అథ్లెట్ గా ఒక సినిమాను చేసింది. ఆ సినిమా లోని తాప్సి లుక్ కు అంతా కూడా అవాక్కవుతున్నారు. సినిమా కోసం ఆమె చాలా ఫిట్ నెస్ ను సాధించింది.
సాదారణంగా బికినీ లో కనిపించేందుకు నాజూకుగా జీరో సైజ్ లో కనిపించాల్సి ఉంటుంది. అందుకు ఆహారం తీసుకోకుండా చిన్న పాటి వర్కౌట్స్ చేస్తే సరిపోతుంది. ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగి పోయి కావాల్సినంత బక్కగా కనిపించి బికినీలో అందంగా కనిపించవచ్చు. బికినీ కోసం రెడీ అవ్వడం చాలా ఈజీనే. కాని ఒక అథ్లెట్ పాత్ర కోసం రెడీ అవ్వడం అంత సులభమైన పని కాదు. రష్మీ రాకెట్ అనే సినిమా కోసం తాప్సి పడ్డ కష్టం అంతా ఇంత కాదట. ఆమె ఫిజిక్ విషయంలో అథ్లెట్ లా కనిపించేందుకు గాను చాలా కష్టపడిందట. ముఖ్యంగా ఆమె వర్కౌట్లు మరియు డైట్ లు ప్రథాన పాత్ర పోషించాయట. ఫిజిక్ ఫిట్ నెస్ తో కనిపించడం కోసం ప్రతి ఒక్క వర్కౌట్ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే.. అందరి దృష్టి ఆకర్షించి మంచి పేరును దక్కించుకోవాలంటే ఎక్కువ శాతం ఫిజిక్ పై దృష్టి పెట్టాలి. సినిమా ఏదైనా పాత్ర ఏదైనా కూడా ఆ పాత్రకు తగ్గట్లుగా కథానుసారంగా ఫిజిక్ ఉంటేనే సినిమా లో ఆ పాత్ర పండుతుంది. ఆ విషయంలో హీరోలు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. కాని తాప్సి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తుంది కనుక ఆమె వర్కౌట్స్ విషయంలో చాలా కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు. రికార్డు స్థాయిలో ఆమె వర్కౌట్ లు మరియు ఆమె ఫిజిక్ తో మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు దక్కించుకుంటుందని అంటున్నారు, ముఖ్యంగా రష్మీ రాకెట్ సినిమా లోని ఆమె ఫిజిక్ ను చూస్తుంటే నిజంగా అథ్లెట్లు కూడా ఇంతటి ఫిట్ నెస్ ను కలిగి ఉంటారా అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.