సారీ.. తెలుగులో నేను నటించలేను

Update: 2015-06-29 22:30 GMT
అతిలోక సుందరి శ్రీదేవి అంతటి కథానాయిక ఒకనాడు అసలు ఈ టాలీవుడ్‌ వాళ్లకు ఏం చేతనవును? అనేసింది. ఇక్కడ సినిమాల్లో గ్లామర్‌ చూపించడానికి వాడుకోవడం తప్ప హీరోయిన్ల కోసం క్యారెక్టర్లు క్రియేట్‌ చేసేవాళ్లెవరు? అని తిట్టిపోసింది. ఆ తర్వాతి కాలంలో చాలామంది కథానాయికలు ఇలా మన ఫిలింమేకర్స్‌ని తిట్టినవాళ్లున్నారు.

కథ కాకరకాయ ఉండదు. హీరోచుట్టూనే కథ తిరుగుతుంది. హీరోయిన్‌ని వ్యాంపూలా మాత్రమే ఉపయోగిస్తారని వాపోయిన భామలెందరో. అంతెందుకు ఇటీవలి కాలంలో టాలీవుడ్‌ని విడిచి వెళ్లిపోయిన ఇలియానా, కాజల్‌ లాంటి భామలే ఎంతో విసిగిపోయి అటెళ్లిపోయామని సెలవిచ్చారు. అయితే వీళ్లంతా ముంబైకో, చెన్నయ్‌కో చెందిన భామలు. మనవాళ్లంటే గిట్టక అలా అన్నారులే అనుకోవచ్చు. కానీ బింధుమాధవి హైదరాబాద్‌ మూలాలున్న పక్కా తెలుగమ్మాయ్‌. అయినా అసలు తెలుగు ఫిలింమేకర్స్‌కి సినిమాలు తీయడం వచ్చా? అసలు టాలీవుడ్‌లో కథానాయికలకు నటించే ఆస్కారం ఉందా? అని పరోక్షంగా ప్రశ్నించింది.

దర్శకనిర్మాతలు అవకాశం ఇస్తామన్నా.. తెలుగులో నటించాల్సిన కర్మ నాకేం పట్టింది. కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలతోనే ఛాన్సులొస్తున్నాయి. విక్రమ్‌ (మన్మధ మణిధాన్‌లో నటిస్తోంది), సూర్య లాంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నాయికా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఛాన్స్‌లు వస్తుంటే ఇక నేను తెలుగులో లడాయి హీరోలతో ఏం నటించను? అని సూటిగా అనలేక డొంక తిరుగుడుగా అనేసింది బింధుమాధవి. అర్ధమైందా బాబులూ...

Tags:    

Similar News