ఆ టైంలో ఫోటోలు బిప్స్ కి నచ్చవంట

Update: 2016-03-07 05:20 GMT
బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు ఈ మధ్య వార్తల్లో బాగానే నానుతోంది. సినిమాల కంటే ఎక్కువగా తన ఎఫైర్ తోనే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తోంది. బిపాషా-కరణ్ సింగ్ గ్రోవర్ లు గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బిప్స్ ఒప్పుకోలేదు కానీ.. కాదని మాత్రం చెప్పలేదు. దీనికి తోడు ఈ మధ్య బిపాషా వేలికి ఓ పెద్ద డైమండ్ రింగ్ తో దర్శనమిస్తోంది. దీంతో అమ్మడి ఎంగేజ్ మెంట్ అయిపోయిందని.. ఇక పెళ్లి మాత్రమే బ్యాలెన్స్ అనే వార్తలు గుప్పుమన్నాయి.

తన పెళ్లి గురించి జరుగుతున్న హంగామా బిపాషాకి బాగా కోపం తెప్పించింది. 'నా పెళ్లి గురించి నేను ప్రకటించే వరకూ ఆగండి, నేను చేసుకోవాలని అనుకున్నపుడు గ్యారంటీగా చెబుతాను. ఓ పని లేనట్లుగా పనికిమాలిన రూమర్స్ రాయద్దు' అంటూ హిస్స్ మంది బిపాషా. అయితే.. ఈమె రాత్రిపూట కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి తిరుగుతున్న ఫోటోలు - జిమ్ నుంచి బయటకొస్తున్న ఫోటోలు బాగానే హల్ చల్ చేశాయి. వీటికి మీద కూడా తన అభిప్రాయాన్ని ఖరాఖండీగా చెప్పింది బిపాషా.

'రాత్రి 10 గంటల తర్వాత నా ఫోటోలు తీయడం నాకు నచ్చదు. అప్పుడు మొహం అంతా జిడ్డుగా - మురిగ్గా ఉంటుంది. బహుశా ఇలా ఫోటోలు తీయించుకునేందుకు ఏ అమ్మాయి ఇష్టపడదు' అంటూ క్లాస్ కూడా పీకేసింది బిపాషా బసు.
Tags:    

Similar News