బాక్స్ ఆఫీస్ ని వేటాడుతున్న నల్ల చిరుత

Update: 2018-02-21 10:05 GMT
వర్ణ వివక్ష అధికంగా ఉండే యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇతర జాతీయుల సినిమాలు ఆడిన దాఖలాలు చాలా తక్కువ. ఇప్పటి దాక వచ్చిన సినిమాలన్నీ లెక్కబెట్టుకున్నా అందులో అత్యధిక శాతం శ్వేతవర్ణం జాతీయులు అంటే స్థానిక అమెరికన్లు తీసినవే ఎక్కువగా ఉంటాయి. కాని ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ బ్లాంక్ పాంథర్ అక్కడ కొత్త రికార్డులు సెట్ చేస్తోంది. మొన్న శుక్రవారం 16వ తేది విడుదలైన బ్లాక్ పాంథర్ అంచనాలకు భిన్నంగా దూసుకుపోతోంది. ఇంకా వారం కూడా పూర్తి కాకుండానే మొదటి వీక్ ఎండ్ ముగిసే సరికి 240 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది. సినిమాలో అధిక శాతం నటీనటులతో పాటు దర్శకురాలు రయాన్ కూలర్ కూడా నల్ల జాతీయురాలే. అయినా సినిమాలో కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంతో వాళ్ళెవరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

ఇంకా జోరు తగ్గని బ్లాక్ పాంథర్ ఫైనల్ రన్ ముగిసే లోపు టాప్ గ్రాసర్ లిస్టులో చేరే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇండియాలో కూడా దీనికి చెప్పుకోదగ్గ వసూళ్లు రావడం విశేషం. ముఖ్యంగా మల్టీ ప్లెక్సులు అధికారంగా ఉండే సిటీ సెంటర్స్ లో బ్లాక్ పాంథర్ దుమ్ము రేపుతోంది. హింది మూవీ అయారి పూర్తిగా నిరాశ పరచడంతో సినిమా ప్రేమికులు అందరూ బ్లాంక్ పాంథర్ కే ఓటు వేస్తున్నారు. ఇలా నల్ల జాతీయుల సినిమా ఇంత ఆదరణ పొందడానికి ఒబామా రెండు పర్యాయాలు అమెరికా ప్రెసిడెంట్ గా పాలన అందించడమే అని సినిమా అనుభవజ్ఞుల విశ్లేషణ. ఒబామా టైంలోనే అధిక శాతం అమెరికన్లలో నల్ల జాతీయులను చూసే విధానంలో మార్పు వచ్చిందని, అదే ఇప్పుడు విషయమున్న బ్లాంక్ పాంథర్ సినిమాకు ఉపయోగపడిందని అంటున్నారు.
Tags:    

Similar News