ఈ ఏడాది మనకు బైబై చెప్పేందుకు రెడీ అవుతోంది. ప్రతి సంవత్సరం లాస్ట్ ఫెస్టివల్ సీజన్ క్రిస్మస్. ఈ సీజన్ లో భారీగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ కావలిసినవి.. చెప్పుకోదగ్గవి అయిన తెలుగు సినిమాలు రెండే. అందులో ఒకటి సుమంత్ నటించిన 'ఇదం జగత్' కాగా.. రెండోది సత్యదేవ్ నటించిన 'బ్లఫ్ మాస్టర్'. ఈ రెండూ శుక్రవారం రిలీజ్ కానున్నాయి.
ఈ రెండూ సినిమాలలో ఏది హిట్ అవుతుందనేది మనకు రిలీజ్ తర్వాత తెలిసే అవకాశం ఉంది గానీ టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాతలు మాత్రం 'బ్లఫ్ మాస్టర్' ను ఫుల్లుగా నమ్మారు. ఎందుకంటే నైజామ్ ఏరియాలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర.. కృష్ణ.. ఈస్ట్.. వెస్ట్ లలో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నాడు. గుంటూరు.. సీడెడ్ ఏరియాల్లో సురేష్ బాబు డిస్ట్రిబ్యూటర్. నెల్లూరు ఏరియాలో V6 వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ లెక్కన టాప్ ప్రొడ్యూసర్స్.. డిస్ట్రిబ్యూటర్లయిన అందరి బ్యాకింగ్ మాత్రం 'బ్లఫ్ మాస్టర్' కు ఉన్నట్టే.
మరి ఇంతమందిని నమ్మించిన 'బ్లఫ్ మాస్టర్' 28 వ తేదీన ప్రేక్షకులను మెప్పిస్తుందేమో వేచి చూడాలి. తమిళంలో సూపర్ హిట్ అయిన 'శతురంగ వేట్టై' సినిమాకు రీమేక్ గా ఈ 'బ్లఫ్ మాస్టర్' తెరకెక్కింది. గోపి గణేష్ ఈ సినిమాకు దర్శకుడు.