ట్రైల‌ర్‌ టాక్ : గౌత‌మి ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకుంది?

Update: 2022-11-30 10:30 GMT
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మ‌కాం మార్చేశాక తాప్సీ విభిన్న‌మైన కాన్సెప్ట్ ఓరియెండెడ్ సినిమాల‌కే ప్రాధాన్య‌త‌నిస్తోంది. 'బేబీ'తో మొద‌లైన తాప్సీ విజ‌యాల ప‌రంప‌ర ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. పింక్‌, ది ఘాజీ ఎటాక్‌, ముల్క్‌, బ‌ద్లా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకుంటూ కొత్త త‌ర‌హా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా 'శ‌భాష్ మిథూ', అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన 'దోబారా' మూవీల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన తాప్సీ తాజాగా మ‌రో విభిన్న‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

తాప్సీ న‌టిస్తున్న లేటెస్ట్ హార‌ర్ థ్రిల్ల‌ర్ 'బ్ల‌ర్‌'. స్పానిష్ మూవీ 'జూలియాస్ ఐ' ఆధారంగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేశారు. అజ‌య్ బ‌హెల్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ మూవీతో తాప్సీ ప్రొడ్యూస‌ర్ గానూ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతోంది. త‌న‌తో పాటు ఈ మూవీని మ‌రో ఐదుగురు క‌లిసి సంయుక్తంగా నిర్మించారు. రీసెంట్ గా ఈ మూవీ టీజ‌ర్‌ ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. హార‌ర్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కిన ఈ మూవీలో తాప్సీ ద్విపాత్రాభిన‌యం చేసింది.

ఐ ఫోన్ మోగుతున్న బ్ల‌ర్ విజువ‌ల్స్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. క‌ళ్లు లేని ఓ అంథురాలు త‌న‌ని ఎవ‌రో వెంబ‌డిస్తున్నార‌ని గ‌మ‌నించి ఎవ‌రు అంటూ అరుస్తుంది. ఆ త‌రువాత త‌ను ఆత్మహ‌త్య చేసుకుంటుంది. హార‌ర్ విజువ‌ల్స్ తో టీజ‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.

తాజాగా ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఇందులో తాప్సీ గాయ‌త్రిగా, గౌత‌మిగా ద్విపాత్రాభిన‌యం చేసింది. త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చిన గాయ‌త్రికి గౌత‌మి ఆత్మ‌హ‌త్య చేసుకుని క‌నిపిస్తుంది.

పోలీసులు, గాయ‌త్రి భ‌ర్త గౌత‌మిది ఆత్మ‌హ‌త్య అని భావిస్తారు. అయితే గాయ‌త్రి మాత్రం గౌత‌మిది ఆత్మ హ‌త్య కాద‌ని, త‌న‌ది ఆత్మ హ‌త్య చేసుకునే మ‌న‌స్థ‌త్వం కాద‌ని వాదిస్తుంది. తానే సొంతంగా గౌత‌మి హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యాన్ని ఛేదించ‌డం కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడుతుంది. ఈ క్ర‌మంలో త‌ను కూడా కంటి చూపుని కోల్పోయే ద‌శ‌కు చేరుకుంటుంది. ఇదే స‌మ‌యంలో త‌న‌ని ఎవ‌రో వెంబ‌డిస్తుంటారు. అదే విష‌యాన్ని గాయ‌త్రి త‌న భ‌ర్త‌కు చెబుతుంది. తాను న‌మ్మ‌డు..

ఇలాంటి ప్ర‌తీకూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో గాయ‌త్రి త‌న సోద‌రి గౌత‌మి హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యాన్ని ఛేదించిందా?. ఇంత‌కీ గౌత‌మిది హ‌త్యా.. ఆత్మ హ‌త్యా..? అన్న‌ది తెలియాలంటే 'బ్ల‌ర్‌' చూసి తీరాల్సిందే. ఈ మూవీ డిసెంబ‌ర్ 5 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్ప‌టికే రెండు స్పానిష్ మూవీస్  రీమేక్ ల‌లో న‌టించి స‌క్సెస్ అందుకున్న తాప్సీ మూడ‌వ రీమేక్ తో కూడా ఆ ఫీట్ ని రిపీట్ చేస్తుందా? అన్న‌ది తెలియాలంటే డిసెంబ‌ర్ 5 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News