అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం పవన్‌ది. ఎన్నికష్టాల్నయినా ఎదుర్కొంటాడు కానీ వెనక్కి మాత్రం తగ్గడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కొన్నిసార్లు అది రుజువైంది కూడా. అయితే ఆయన సెట్లోనూ అలాగే ఉంటాడట. స్వతహాగా పవన్‌లో ఒక రచయిత, దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసిందే. తాను ఊహించనట్టుగా సన్నివేశం వచ్చేవరకూ ఆయన విశ్రమించడట. అందుకోసం చిత్రబృందంలోని అందరినీ పరుగులు పెట్టిస్తుంటాడట. ఆ విషయాన్నే పవన్ తో కలిసి పనిచేసిన దర్శకుడు బాబీ స్వయంగా మీడియాకి చెప్పుకొచ్చాడు.
``పవన్ కళ్యాణ్ వంద గుర్రాలతో షూటింగ్ అని స్క్రిప్టులో రాసుకుంటే వంద గుర్రాలతో సినిమా చేయాల్సిందే. లేదంటే ఆయన ఒప్పుకొనే ప్రసక్తే లేదు. అలా ప్రతీ విషయంలోనూ పక్కాగా ఉంటారు. అలాంటి రాజీలేని ధోరణి ఉన్నప్పుడే సినిమా అనుకున్నట్టుగా వస్తుంది. ఆయనలో నాకు బాగా నచ్చిన గుణం అదే. అయితే పవన్ తో పనిచేయడం సులువేమీ కాదు. రోజూ ఒక యుద్ధంలా ఉంటుంది. కానీ ఆయన్ని భరిస్తే మాత్రం వచ్చే కిక్కే వేరు. సాయంత్రంలోపు ఆయన ఓ చిన్నపిల్లాడవుతాడు. కష్టపడి పనిచేసిన సాటి వ్యక్తిని ఆయన గౌరవించే విధానం, ఇచ్చే ప్రశంసలు భలే కిక్కిస్తుంటుంది. ఆ కిక్కు బయటి ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. నా గురించి చిరంజీవిగారికి కూడా చెప్పాడట. అంతకంటే గొప్ప ప్రశంస నాకు ఇంకేముంటుంది?`` అని చెప్పుకొచ్చాడు బాబీ. పవన్ రాసిన సర్దార్ గబ్బర్ సింగ్ స్క్రిప్టుని తెరకెక్కించింది బాబీనే.