బాబీ.. పవన్ కళ్యాణ్ సినిమాకి బాబీ దర్శకత్వం అనగానే చాలారకాల కామెంట్స్ వినిపించాయ్. వీటన్నిటికీ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో సమాధానం చెప్పేశాడు బాబీ. అలాగే తనకు చిరంజీవి అంటే ఎంత అభిమానమో.. ఎందుకు ఇష్టమో డీటైల్డ్ గా చెప్పుకొచ్చాడు బాబీ.
'నేను చిన్నపుడు స్కూల్ కి వెళ్లనంటే అమ్మ - నాన్న అరిచేవారు. కానీ ఓ పండగ రోజు మాత్రం మాకు స్పెషల్. ఆ పండగ పేరు చిరంజీవి గారి సినిమా రిలీజ్. ఆ రోజున ఎగ్జామ్ ఉన్నా స్కూటర్ మీద నాన్న చిరంజీవి సినిమాకి తీసుకెళ్లిపోయేవాడు. ఆ తర్వాత కాలేజ్ రోజుల్లోకి వచ్చాక పవర్ స్టార్ పండగ కూడా వచ్చింది. 12 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ సమయంలో పవన్ తో ఫోటో దిగే ఛాన్స్ రాలేదు. అలాంటిది సినిమా తీసే ఛాన్స్ వచ్చింది.' అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు బాబీ.
అలాగే సర్దార్ స్టోరీ గురించి చెబుతూ.. 14 ఏళ్లు తాను కష్టపడి రాస్కున్న కథను తనను తీయమని చెప్పడంతోనే పవన్ నమ్మకం అర్ధమవుతుందని అన్నాడు. పూణే వెళ్లి 3 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ తీసేసినా.. కనీసం ఒక్క సీన్ కూడా చూడలేదట. పవన్ నుంచి యుద్ధం చేయడం,. ఓపిక పట్టడం, జనాన్ని ప్రేమించడం నేర్చుకున్నానని అన్నాడు బాబి. తమ యూనిట్ లో ప్రతీ రోజూ 7కెమెరాలు ఉంటాయని.. అంతగా నిర్మాత సహకారం అందించాడని చెప్పుకొచ్చాడు బాబీ. అలాగే డీఎస్పీ ప్రతీ సీడీ తన కార్ లో ఉంటుందని చెప్పాడు బాబీ.