భారతీయ సినిమా మొదటి మూకీ చిత్రం `రాజా హరిశ్చంద్ర` 3 మే 1913న విడుదలైంది. 109 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర భారతీయ సినిమాకి ఉంది. అయితే ఈ వందేళ్లలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎంతగానో ఎదిగింది. బాలీవుడ్ సహా ప్రాంతీయ పరిశ్రమలు గొప్పగా పురోగమించాయి. కులం మతం ప్రాంత వయో బేధాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీక్షించే దృగ్విషయంగా `సినిమా` పరిశ్రమ సంచలనంగా నిలుస్తోంది. అయితే వందేళ్ల భారతీయ సినీపరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ దాదాపు అర్థ శతాబ్ధం అంకితమిచ్చారు. ఆయన సాధించినన్ని విజయాలు ఇంకెవరూ సాధించలేదేమో. ఆయన చేసినన్ని ప్రయోగాలు వేరొకరికి సాధ్యం కాదు. నేడు దేశంలో ఉన్న స్టార్లంతా తమకు అమితాబ్ స్ఫూర్తి అని ప్రతి వేదికపైనా చెబుతూనే ఉన్నారు. అయితే అలాంటి ఘనచరిత కలిగిన బచ్చన్ ల వంశం నుంచి నేను కూడా సూపర్ స్టార్ అని నిరూపించగలిగిన మరో స్టార్ లేకపోవడం ఎల్లవేళలా చర్చనీయాంశంగా మారుతోంది.
అమితాబ్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ తన స్థానాన్ని మెరుగు పరుచుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా నేటి కాంపిటీషన్ లో అది సాధ్యం కాలేదు. స్మాల్ బి కేవలం ఒక సాధారణ నటుడిగానే మిగిలిపోయాడు తప్ప తండ్రి లెగసీని ముందుకు నడిపించడంలో అసాధారణ స్టార్ డమ్ ని అందుకోవడంలో తడబడ్డాడు. తండ్రిని మించిన తనయుడిగా సత్తా చాటడంలో విఫలమయ్యాడన్న విమర్శలున్నాయి.
అయితే అభిషేక్ ఎదుగుదలకు అమితాబ్ సూచనలు సలహాలు సహకరించలేదా? తనని విమర్శించిన నోళ్లను మూయించేందుకు అతడు ఎలాంటి ప్రయత్నం చేయలేదా? అంటే ఎందుకు చేయలేదు. అదేమిటో అతడి నోటి నుంచే వింటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ చెప్పిన ఆన్సర్ కొంత సర్ ప్రైజింగ్ గానే ఉంది. అభిషేక్ బచ్చన్ తన పనిపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు. అతడు వినోదరంగంలో రెండు దశాబ్దాల కెరీర్ లో హెచ్చు తగ్గులను చవి చూసానని తెలిపాడు. కొన్నిసార్లు విమర్శకుల ప్రశంసలు అవార్డులు పొందిన పాత్రలు తనకు దక్కినా కానీ విమర్శకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న పాత్రలను కూడా చేయాల్సొచ్చింది. తనకు స్ఫూర్తిగా నిలిచిన చెడు సమీక్షలు - విమర్శల కోసం ఒక స్క్రాప్ బుక్ ను ఉంచుకుంటానని అభిషేక్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
అభిషేక్ 2002లో `శరత్` చిత్రం చేస్తున్నప్పుడు నాటి ఒక ఇంటర్వ్యూలో విమర్శలను ఫీడ్ బ్యాక్ గా ఉపయోగించుకునే అలవాటు తనకు ఉందని కూడా తెలిపాడు. ఇప్పటికీ అలా చేస్తానని కానీ ఇప్పుడు వేరే పద్ధతిలో!! అంటూ గుంభనగా మాట్లాడాడు. ``నేను దానిని (విమర్శల)ను నా బాత్రూమ్ అద్దం మీద ఉంచేవాడిని. అది పూర్తిగా కప్పి ఉన్నందున నా దగ్గర అద్దం లేదు. కానీ ఇప్పుడు స్క్రాప్ బుక్ లో వాటిని ఉంచాను``అని అతను చెప్పాడు. తనని విమర్శిస్తూ వచ్చే చాలా రివ్యూలలో ఎవరి అభిప్రాయానికి కట్టుబడి ఉండేవారు? అని ప్రశ్నించగా..``అందరి అభిప్రాయాలు చదివేవాడిని. ప్రతి ఒక్కరూ నా ప్రేక్షకులు కాబట్టి అన్నింటినీ ఎంచుకోవాలని భావిస్తాను`` అని చెప్పాడు.
చెడు సమీక్షల రికార్డును తమ వద్ద ఉంచాలనే ఆలోచన తన తండ్రి గారు అయిన ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తనకు ఇచ్చిన సలహా అని కూడా అభిషేక్ వెల్లడించాడు. ``ఆ సమీక్షల్ని ఒకచోట ఉంచి ప్రతిరోజూ చదవండి.. అవన్నీ తప్పు అని నిరూపించడానికి ముందుకు సాగండి.. విమర్శలను ప్రేరణగా ఉపయోగించుకోండి`` అని అమితాబ్ చెప్పేవారట.
``వారు నన్ను నేను మెరుగుపరుచుకోమని చెప్తున్నారు కాబట్టి ఎలా మెరుగుపరుచుకోవాలో ప్రతిరోజూ ఉదయం సమీక్షలను చదవనివ్వండి. వాటి ఆధారంగా చురుగ్గా పని చేయనివ్వండి`` అని అభిషేక్ ఎంతో వినయంగా కోరాడు ఆ ఇంటర్వ్యూలో.
అయితే అభిషేక్ తన తండ్రి సలహాను పాటించినా కానీ ఆశించిన రేంజుకు చేరుకోవడంలో విఫలమయ్యాడన్న విమర్శలున్నాయి. తండ్రి ఎన్ని సలహాలిచ్చినా ఏం లాభం? బిగ్ బి అనుభవాల నుంచి నేర్చుకున్నవి తాను పాటించినా ఎదగలేకపోయిన హీరోగా మిగిలిపోయాడు. చెడు రివ్యూలు తప్పు అని నిరూపించమన్నారు సరే? కానీ దానిని నిరూపించడంలో అభిషేక్ ప్రయత్నం ఎలా సాగింది? అన్నది ప్రశ్నగానే మిగిలింది. అతడిని ఒక సల్మాన్ ఖాన్ - షారూక్ ఖాన్ లేదా హృతిక్- అక్షయ్ - కార్తీక్ ఆర్యన్ లా గుర్తుంచుకున్నది ఎందరు? అయితే రంగుల ప్రపంచంలో నటవారసులందరూ స్టార్ డమ్ ని ఆస్వాధించలేరని ఇప్పటికే చాలా మందికి అనుభవమైంది. ఈ రంగంలో ఎలాంటి నేపథ్యం లేని వారు కూడా ఎదుగుతున్న వైనం బయటపడుతోంది. ఇటీవల ఓటీటీలు డిజిటల్ ట్రెండ్ లో ఎవరికి వారే హీరోగా మారుతున్నారు. హీరోగా ప్రయత్నించకపోవడమే ఒక బిగ్ మిస్టేక్ అన్న చందంగా నేటి పరిశ్రమ రూపురేఖలు మార్చుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.