పాపం సీనియర్ హీరోయిన్‌ ను ఆడేసుకుంటున్నారు..!

Update: 2022-06-01 06:30 GMT
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగి.. ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను చేసి ముఖ్యంగా కింగ్ ఖాన్ షారుఖ్‌ కు సరైన జోడీ అంటూ పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ కాజోల్‌. హీరోయిన్ గా అప్పట్లో చేసిన సినిమాలు మరియు ఆమె దక్కించుకున్న హిట్స్ కారణంగా ఇప్పటికి కూడా అదే క్రేజ్ మరియు స్టార్‌ డమ్‌ ను కాజోల్‌ కలిగి ఉంది. అభిమానులు కూడా కాజోల్‌ కు పెద్ద ఎత్తున ఉంటారు.

ఈమద్య కాలంలో సినిమాల్లో నటించడం తగ్గించిన కాజోల్‌ వర్కౌట్స్ విషయమై శ్రద్ద పెట్టలేదేమో. అందుకే కాజోల్‌ బరువు కాస్త ఎక్కువ అయ్యింది. ఇటీవల జిమ్ నుండి బయటకు వస్తూ ఉన్న కాజోల్‌ మీడియా కెమెరా కంట పడింది. దాంతో ఆమె ఫోటోలను క్లిక్ అనిపించారు. జిమ్‌ డ్రస్ లో ఉన్న కాజోల్‌ ను చూసి చాలా మంది ఆమె అభిమానులు కూడా అవాక్కు అవుతున్నారు.

బాబోయ్‌ కాజోల్‌ ఇంత బరువు పెరిగిందేంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొందరు మాత్రం ఆమె వయసు అయిదు పదులకు చేరువ కాబోతుంది. ఈ వయసులో కూడా మూడు పదుల వయసులో ఉన్నట్లుగా సన్నగా నాజూకుగా ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడు కూడా ఒక వర్గం వారు ఎవరిని ట్రోల్స్ చేద్దామా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. వారు కాజోల్‌ ను ఆడేసుకుంటున్నారు.

కాజోల్‌ ను మోటు ఆంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. మరి కొందరు కాజోల్‌ ఆంటీ బరువు ఇలా పెరుగుతున్నారు ఏంటీ అంటూ రకరకాలుగా చర్చించుకుంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి కాజోల్‌ న్యూ లుక్‌ అదే కాస్త బరువు పెరిగిన లుక్ ను పాజిటివ్‌ మరియు నెగటివ్‌ కామెంట్స్ తో వైరల్‌ అయ్యేలా చేయడంలో నెటిజన్స్ సఫలం అయ్యారని చెప్పాలి.

హీరోయిన్ గా కాకున్నా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అమ్మగా ఇతర పాత్రల్లో కనిపిస్తూ.. మరో వైపు వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈ సీనియర్ హీరోయిన్ నటిస్తూ ఉంది. ఎవరు ఏం అనుకున్నా కూడా తాను చేసేది తాను చేస్తాను అన్నట్లుగా కాజోల్‌ సైలెంట్ గా తన పనిలో మునిగి పోయారు.

కాజోల్‌ బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మునుపటి లుక్ లో పొట్ట లేకుండా కనిపిస్తారు అంటూ ఆమె సన్నిహితులు సోషల్‌ మీడియా లో కామెంట్స్ చేస్తున్న వారికి సమాధానం ఇస్తున్నారు.
Tags:    

Similar News