బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన ఇన్ స్టా ఫ్యామిలీని రెగ్యులర్ గా తన ఆకర్షణీయమైన లుక్స్ పర్ఫెక్ట్ టోన్ ఫిగర్ ని ఎలివేట్ చేయడం ద్వారా ఆకర్షిస్తుంటుంది. ఆన్ లొకేషన్ షూటింగ్ లో బిజీగా ఉన్నా లేదా తన స్నేహితులతో సరదాగా గడిపినా ఆమె తన స్టైలిష్ ఫోటోలు వీడియోలతో తన అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇటీవల బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలతో వేడెక్కించిన దిశా ఇప్పుడు కొత్త లుక్ తో కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత తనదైన స్టైలిష్ లుక్ ను అభిమానుల కోసం షేర్ చేసింది.
ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ కోసం షూటింగ్ లో పాల్గొన్న దిశా ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో దిశా పింక్ కార్గో ప్యాంటు .. వైట్ స్నీకర్లతో జతగా రెడ్ స్పోర్ట్స్ బ్రాలెట్ ధరించి కనిపించింది. పాక్షికంగా తన హెయిర్ ని ఫ్రీస్టయిల్ లో ఉంచింది. అలా ఫోటోషూట్ కి అదిరిపోయే భంగిమతో స్టైలిష్ డ్యాన్సింగ్ మోడ్ లో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.
ఈ వీడియోతో పాటు ఇటీవల దిషా పటానీ తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. బ్రౌన్ క్రాప్ టాప్ - లెదర్ ప్యాంటుతో అదిరిపోయే ఫోటోషూట్ అది. దిశా వరుస ఫోటోషూట్లపై బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ వెంట వెంటనే వ్యాఖ్యలతో వేగంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. దిశా చివరిగా రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో కలిసి కనిపించింది. తరువాత ఆమె ఏక్తా కపూర్ -కెటినా .. మోహిత్ సూరి- ఏక్ విలన్ రిటర్న్స్‌లో కనిపిస్తుంది. ఇందులో జాన్ అబ్రహం- తారా సుతారియా- అర్జున్ కపూర్ తదితరులు నటించారు. ఈ చిత్రం సిద్దార్థ్ మల్హోత్రా- శ్రద్ధా కపూర్- రితేష్ దేశ్ ముఖ్ నటించిన 2014 చిత్రం ఏక్ విలన్ కి సీక్వెల్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో పుష్ప చిత్రంలో దిశా పటానీ ఐటమ్ నంబర్ చేయనుందని కథనాలొస్తున్న సంగతి తెలిసినదే.

Just @DishPatani being cute & extra