'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో.. అమ్మడు టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది.
సీతా మహాలక్ష్మీగా మృణాల్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ కు మనోహరమైన లుక్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. చూపు తిప్పుకోనివ్వలేని అందంతో యువ హృదయాలను కొల్లగొట్టిందని చెప్పాలి.
ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ బ్యూటీకి ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ తలుపుతడుతున్నాయని తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 'సీతా రామం' సినిమా కంటే ముందే మృణాల్ ఠాకూర్ తెలుగులోకి వచ్చింది.
సినిమాలతో కాకుండా.. ఓ డబ్బింగ్ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది. మృణాల్ తన కెరీర్ ను టీవీ సీరియల్స్ తో ప్రారంభించింది. రెండు డైలీ సీరియల్స్ లో నటించిన తర్వాత ఆమె 'కుంకుమ్ భాగ్య' అనే ధారావాహికతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
జీ టీవీలో ప్రసారం చేయబడిన ఈ షో అప్పట్లో ప్రతి ఇంటికి అత్యంత ఇష్టమైన హిందీ సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ డైలీ షోని తెలుగులో 'కుంకుమ భాగ్య' పేరుతో డబ్ చేశారు. అందులో కథానాయికగా చెల్లెలిగా నటించి అందరినీ ఆకట్టుకుంది మృణాల్.
ఇదే క్రమంలో స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకు వచ్చి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 'లవ్ సోనియా' 'సూపర్ 30' 'బాట్లా హౌస్ 1' 'ఘోస్ట్ స్టోరీస్' 'తూఫాన్' 'ధమాకా' వంటి హిందీ చిత్రాల్లో మృణాల్ ఠాకూర్ నటించింది.
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన 'జెర్సీ' హిందీ రీమేక్ లో మృణాల్ హీరోయిన్ గా నటించిందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు 'సీతా రామం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ.
హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది మృణాల్. ఇందులో రష్మిక మందన్నా మరో కీలక పాత్ర పోషించింది.
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందిన 'సీతా రామం' సినిమాలో సీత పాత్రకు పూర్తి న్యాయం చేసింది మృణాల్. సహజమైన నటన.. అందం - అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుందని చెప్పాలి.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న మృణాల్.. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా తొలి అడుగు వేసింది. దీని ఆమెకు మరిన్ని ఆఫర్స్ వస్తాయని సినీ అభిమానులు భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.