ఎట్టకేలకు ఈ ఏడాది మరో మోస్ట్ వాంటెడ్ బాలీవుడ్ సెలబ్రిటీ వెడ్డింగ్ జరిగిపోయింది. జోధ్ పూర్ వేదికగా జరిగిన ప్రియాంకా చోప్రా నిక్ ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. కాకపోతే దీనికి సెలబ్రిటీలు ఎవరెవరు వచ్చారా అనే ఆసక్తి మీడియా వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా చాలా ఉంది. కానీ వచ్చిన సమాచారం మేరకు బి టౌన్ స్టార్స్ చాలా మటుకు పిసి పెళ్ళికి రాలేదని వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ చెల్లి అర్పితా ఖాన్ నిన్నే అక్కడికి చేరుకున్నప్పటికీ అన్నయ్య మాత్రం రానని తెగేసి చెప్పాడట. దానికి కారణం లేకపోలేదు.
సల్లు లేటెస్ట్ మూవీ భరత్ లో ముందు నటిస్తానని ఒప్పుకుని తర్వాత హ్యాండ్ ఇచ్చింది ప్రియాంకా. దీని వల్ల టీమ్ చాలా ఇబ్బంది పడింది కూడా. పైకి నవ్వుతూ స్వాగతించినా సల్మాన్ మాత్రం ఈ విషయంలో ఎంత గరంగా ఉన్నాడో అర్థమైపోయింది. ఇక అక్షయ్ కుమార్ తనకు అత్యంత సన్నిహితుడైన ఓ స్నేహితుడి కుమారుడి పెళ్లి కోసం విదేశాలకు ప్రయాణం పెట్టుకుని ఆ మేరకు పిసి టీమ్ కు విషెస్ మెసేజ్ పంపాడట. వీళ్ళే కాదు షారుఖ్ ఖాన్-అజయ్ దేవగన్-అమీర్ ఖాన్-అజయ్ దేవగన్-రన్బీర్ కపూర్ రావడం గురించి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.
వీళ్ళతో కలిసి నటించినా సత్సంబంధాలు కొనసాగించకపోవడం వల్లే రావడానికి అంత ఆసక్తి చూపడం లేదని ముంబై మీడియా టాక్. చివరి నిమిషంలో ఒకరిద్దరు కనిపించినా అధిక శాతం డుమ్మా కొట్టడానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిసింది. కాకపోతే ప్రియాంకా చోప్రాను డైరెక్ట్ చేసిన సంజయ్ లీలా భన్సాలీ-రాకేష్ రోషన్-విశాల్ భరద్వాజ్ అటెండెన్స్ మాత్రం ఉంటుందని టాక్. ఏదైతేనేం ప్రియాంకా పెళ్లి ఫోటోలు మాత్రం ఆన్ లైన్ లో రచ్చ చేస్తున్నాయి. తనకన్నా పదకొండేళ్ళ చిన్నవాడితో పెళ్ళికి ఓకే చెప్పి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన ప్రియాంకా ఈ వేడుక కాస్తా అయిపోతే అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఏర్పాట్లు కూడా చేసేసుకుంది. ముంబై రిసెప్షన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది