అబ్బాయిలూ ప్లీజ్... క్రాకర్స్ పేల్చడం మానుకోండి

Update: 2022-10-19 01:30 GMT
దీపావ‌ళి అంటేనే ట‌పాసుల పండ‌గ‌. కానీ దానిని వ్య‌తిరేకించే సెల‌బ్రిటీల‌కు కొద‌వేమీ లేదు. దీపావళి 2022 కి మితిమీరిన‌ క్రాకర్స్ శ‌బ్ధాల‌ను వ్యతిరేకిస్తూ కాలుష్య రహితమైన‌.. పెంపుడు జంతువులకు అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలని సెల‌బ్రిటీలు అభిమానులను కోరుతున్నాను. ఈ జాబితాలో ప్రియాంక చోప్రా- అలియా భట్ స‌హా పలువురు బాలీవుడ్ ప్రముఖులు క్రాకర్లు పేల్చవద్దని తమ అభిమానులను కోరారు.

స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ అందరూ పండుగ జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. దివ్వెలు వెలిగించడం రుచికరమైన స్వీట్లు  ఆహారం తినడంతో పాటు ప్రజలు ట‌పాసులు పేల్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు క్రాకర్లు పేల్చవద్దని అభిమానులను కోరుతున్నారు. కాలుష్య రహిత దీపావళిని జ‌రుపుకోవాల‌ని పిలుపునిచ్చారు.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నటీమణులలో ఒకరు. క్రాకర్లు పేల్చడం పర్యావరణంపై ప్రభావం చూపుతుంది కాబట్టి పీసీ ఎప్పుడూ క్రాకర్స్ లేని దీపావళిని ప్రచారం చేస్తుంది. అయితే దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా అభిమానులు ఈ సంవత్సరం కూడా ఆమె అభ్యర్థనను వింటారని క‌చ్చితంగా భావిద్దాం.

దిశా పటాని

గత సంవత్సరం దిశా పటానీ కూడా ప్రజలు పెంపుడు జంతువులకు అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలని .. క్రాకర్స్ రహితంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాల‌తో బిజీగా ఉన్నా కానీ సామాజిక మాధ్య‌మాల్లో దిశా నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.

అనన్య పాండే

కొన్ని సంవత్సరాల క్రితం అనన్య పాండే తన పెంపుడు కుక్కలతో ఒక అంద‌మైన ఫోటోని పంచుకుంది. క్రాకర్లు పేల్చవద్దని ప్రజలను అభ్యర్థించింది. అబ్బాయిలు ప్లీజ్... ఫైర్ క్రాకర్స్ పేల్చడం మానుకోండి. అది మనకే కాదు జంతువులకు సుర‌క్షితం. మేలు చేసిన‌ట్ట‌వుతుంది... అని అభ్య‌ర్థించింది.

నేహా ధూపియా

గత సంవత్సరం నేహా ధూపియా క్రాకర్లు పేల్చవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థించింది. దయచేసి ట‌పాసులు పేల్చడం ఆపండి.. పర్యావరణం దెబ్బ తింటోంది. మనల్ని బాధిస్తోంది. మన పిల్లలను బాధపెడుతోంది... దయచేసి మానేయండి`` అని ట్వీట్ చేసింది.

అలియా భట్

2017లో ఆలియా భట్ #PoochOverPataka అనే క్యాంపెయిన్ ను ప్రారంభించింది. మూగ జీవాలు.. జంతుజాలం భయపడుతున్నందున క్రాకర్లు పేల్చవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆలియాకు ఒక పెంపుడు పిల్లి ఉన్న సంగతి తెలిసిందే. దాని ఆనందం కోసం ట‌పాసులు కాల్చ‌న‌ని చెప్పింది.

అనుష్క శర్మ

2015లో అనుష్క పాజిటివిటీ పేరుతో క్రాక‌ర్ల‌కు వ్య‌తిరేక‌ ప్రచారాన్ని కూడా చేసింది. క్రాకర్లు పేల్చడం వల్ల శబ్దం వస్తుంది. అది జంతువులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి శబ్దం లేని దీపావళిని జరుపుకోవాలని ప్రజలను అభ్యర్థించింది.

ఇంకా టాలీవుడ్ కి చెందిన ప‌లువురు క‌థానాయిక‌లు కూడా క్రాక‌ర్ల వ‌ల్ల కాలుష్యాన్ని ఆపాల‌ని నిన‌దిస్తున్నారు. కాలుష్య ర‌హిత దీపావ‌ళిని ఆనందంగా జ‌రుపుకోవాల‌ని పిలుపునిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News