ఎవడి జీవితంలో వాడే హీరో అన్న మాటకు తగ్గట్లే.. చాలామంది జీవితాలు ఉంటాయి. కోట్లాది మందికి సాధ్యం కానివి.. కొందరు ఇట్టే చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అలాంటి పనే చేశారు బాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన మిలాప్ జవేరి. సత్యమేవ జయతే మూవీతో ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏడాది క్రితం 130 కేజీల బరువు ఉన్న ఆయన.. ఇప్పుడు వందకు వచ్చేశారు.
ఏడాదిలో అంత భారీగా బరువు తగ్గటం మామూలు కాదు. అదెలా సాధ్యమైంది? ఇప్పుడు తాజా టార్గెట్ ఎంతన్న విషయంలోకి వెళితే.. ఆయన చెప్పిన విశేషాలు వింటే.. వావ్ అనకుండా ఉండలేం. ఏడాది క్రితం వరకు తన భారీకాయంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదని.. చివరకు తన ఆరేళ్ల కొడుకుతో ఆడుకోవటం కూడా కష్టంగా ఉండేదని చెప్పారు.
‘పిల్లాడితో సరిగా ఆడుకోలేకపోయేవాడిని. ఇట్టే నీరసం వచ్చేది. దీంతో.. బరువు తగ్గాలని డిసైడ్ అయ్యా. నాకు నేను ఫిట్ గా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను పెట్టుకున్నా. క్రమం తప్పకుండా డైట్ ఫాలో అయ్యేవాడిని. ఒక్కసారి కూడా నన్ను నేను మోసపుచ్చుకోలేదు. బ్రేక్ ఫాస్ట్.. లంచ్.. డిన్నర్ మూడు పూటలా తినేవాడిని.. కాకుంటే తక్కువ కార్బ్.. హై ప్రోటీన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవాడిని’’ అని చెప్పుకొచ్చారు.
బరువు తగ్గే క్రమంలో తనను తాను మోసగించుకునేలా వ్యవహరించలేదని..ట్రైనర్ చెప్పినట్లే ఫాలో అయ్యే వాడిని అని చెప్పాడు. దీంతో తన శరీరంలో మార్పు మొదలైందని.. ఆ తర్వాత మాత్రం ప్రతి ఆదివారం నచ్చేది మాత్రం తినేవాడినని.. హాలీడే వేళలోనూ వర్కవుట్ మానలేదని తెలిపాడు. ఈ కారణంతోనే ఏడాది వ్యవధిలోనే 30 కేజీలు తగ్గానని చెప్పాడు. ప్రస్తుతం తన బరువు వంద కేజీల వరకు ఉన్నానని.. మరో పదిహేను - ఇరవై కేజీల వరకు తగ్గాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
తాను బరువు తగ్గే క్రమంలో తన కుటుంబంతో పాటు.. స్నేహితులు తనకు చాలా సపోర్టుగా నిలిచేవారన్నారు. బరువు తగ్గటం క్రమపద్దతిలో సాధ్యమేనని చెబుతున్న మిలాప్.. వెయిట్ లాస్ టిప్స్ చెబుతున్నాడు. కసిగా తగ్గాలని ఒకసారి డిసైడ్ అయ్యాక.. అందుకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా తగ్గుతారు. కాకుంటే.. కచ్ఛితమైన కమిట్ మెంట్ తప్పనిసరి.