ఇక్క‌డ మొద‌టిదే రాలేదు..అక్క‌డ సీక్వెల్ కూడా..!

Update: 2023-02-16 08:00 GMT
స‌క్సెస్ ఫుల్ మూవీస్ కి సీక్వెల్స్ చేయ‌డం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సైతం సొంతం చేసుకున్న సినిమాల‌కు ప్ర‌స్తుతం సీక్వెల్స్ మొద‌ల‌య్యాయి. ఇందులో భాగంగానే బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `డ్రీమ్ గాళ్` కు సీక్వెల్ రాబోతోంది. విభిన్న‌మైన సినిమాల‌లో బాలీవుడ్ లో ప్ర‌త్యేక గుర్తింపుని సొంత చేసుకోవ‌డ‌మే కాకుండా `అంధాదూన్` తో జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న హీరో ఆయుష్మాన్ ఖురానా.

2019లో త‌ను న‌టించిన హిట్ మూవీ `డ్రీమ్ గాళ్`. నుస్ర‌త్ బారూచా హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని రాజ్ శాండిల్య రూపొందించ‌గా బాలాజీ మోష‌న్ పిక్చ‌ర్స్‌, ఆల్ట్ ఎంట‌ర్ టైమ్ మెంట్ బ్యాన‌ర్ ల‌పై ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. ఓ యువ‌కుడు అమ్మాఇయ‌గా మారి చేసే వినోదాల విందుగా ఈ మూవీని తెర‌కెక్కించారు. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ మంచి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది.

ఆయుష్మాన్ ఖురానా న‌ట‌న ప్ర‌ధాన హైలైట్ గా నిలిచింది. ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేయాల‌ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వారు రైట్స్ కూడా తీసుకున్నారు. రాజ్ త‌రుణ్ హీరోగా రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి డి. సురేష్ బాబు ప్ర‌క‌ట‌న కూడా చేశారు.

కానీ ఇంత వ‌ర‌కు ఈ మూవీ ప‌ట్టాలెక్క‌లేదు. కానీ `డ్రీమ్ గాళ్` కు సీక్వెల్ ని బాలీవుడ్ పూర్తి చేయ‌డం విశేషం. ఆయుష్మాన్ ఖురానా నే ఇందులో హీరో. పూజా అనే పాత్ర‌లో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి రెడీ అయిపోయాడు.

రాజ్ శాండిల్య  డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని బాలాజీ మోష‌న్ పిక్చ‌ర్స్‌, ఆల్ట్ ఎంట‌ర్ టైమ్ మెంట్ బ్యాన‌ర్ ల‌పై ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ని మాత్రం మార్చేశారు. `డ్రీమ్ గాళ్`లో హీరోయిన్ గా నుస్ర‌త్ బారూచా న‌టిస్తే సీక్వెల్ లో మాత్రం అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంమ‌బంధించిన ఓ వీడియోని హీరో ఆయుష్మాన్ ఖురానా విడుద‌ల చేశాడు.

సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా `బ్రేకింగ్ న్యూస్.. పూజా..డ్రీమ్ గాళ్ ఈజ్ బ్యాక్‌...7 కో సాత్ మే దేఖేంగే` అంటూ ఆ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. డ్రీమ్ గాళ్ గెట‌ప్ లో బెడ్ పై నుంచి లేచి మేక‌ప్ చేసుకుంటున్న ఆయుష్మాన్ ఖురానీ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి సంద‌డి చేస్తోంది. ఈ సీక్వెల్ ని 2023, జూలై 7న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని కూడా హీరో స్ప‌ష్టం చేస్తూ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించాడు.
Full View

Similar News