యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం అని ఏ ముహూర్తాన ఫిక్స్ చేశారో కానీ ఈ ప్రాజెక్ట్ కు అడుగడుగున అవాంతరాలే ఎదురవుతున్నాయి. ముందు ఈ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని ప్లాన్ చేశారు. క్లాప్ కొట్టలేదు.. ముహూర్తం జరగలేదు.. అనౌన్స్ మెంట్ అయ్యాక సినిమా చేతులు మారింది. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కొరటాల శివ చేతుల్లోకి వెళ్లింది. నెంబర్ సేమ్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లపై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించి కూడా దాదాపు ఏడాది కావస్తోంది. అయితే ఈ మూవీ రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. మరో పక్క దర్శకుడు కొరటాల శివ కూడా `ఆచార్య` పనుల్లో బిజీగా వుండటం కూడా ఈ మూవీ పట్టలెక్కకపోవడానికి ప్రధాన సమస్యగా మారింది. ఇదిలా వుంటే.. `ఆర్ ఆర్ ఆర్` కారణంగా టాలీవుడ్ దేశ వ్యాప్తంగా పాపులర్ కాడంతో బాలీవుడ్ హీరోయిన్ లు టాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న అలియాభట్ తాజాగా ఎన్టీఆర్ 30 వ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అయితే తాజాగా ఆమె ఈ మూవీకి హ్యాండిచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కారణంగానే సినిమాకు బ్రేక్ పడిందని కూడా చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే... రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొరటాల శివతో చేయనున్న చిత్రాన్ని ఎన్టీఆర్ ప్రారంభించడానికి రెడీ అయిపోయారు. ఇందులో భాగంగానే దర్శకుడు అలియాభట్ ని హీరోయిన్ గా నటించమని సంప్రదించడం, తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయి.
అయితే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పట్టాలెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశారట. కానీ అలియా మాత్రం తాను రాలేనని, తను రావాలంటే రెండు వారాలు ఆగాల్సిందే అంటు షాకివ్వడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ - కొరటాల ప్రాజెక్ట్ ఓ పాన్ ఇండియా మూవీ. దీనికి అలియా భట్ తోడైతేనే నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ అవుతుంది.
ఆ ప్లాన్ లో భాగంగానే కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ కోసం అలియా భట్ ని ఫైనల్ చేశారు. అయితే తాను అనుకున్న ప్రకారం ఫిబ్రవరి ఫిస్ట్ వీక్ లో మూవీని ప్రారంభించడానికి అలియాభట్ అడ్డుచెప్పడంతో ఈ సినిమా ప్రారంభానికి బిగ్ బ్రేక్ పడింది అంటున్నారు.
అలియాభట్ నటించిన బాలీవుడ్ చిత్రం `గంగూబాయి కతియావాడీ`. సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీపై అలియాభట్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డుని అలియా భట్ ఎక్స్పెక్ట్ చేస్తోందట. ఈ నెల 25నే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వున్న అలియా భట్... ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ కి రాలేనని ఖచ్చితంగా చెప్పేసిందట. అలియా సడన్ గా హ్యాండివ్వడంతో చేసేది లేక లాంఛింగ్ కోసం మరో డేట్ ని ఫిక్స్ చేసే పనిలో వున్నారట మేకర్స్.