న‌గ్నంగా న‌టించ‌డం న‌చ్చ‌క అవకాశాలు పోగొట్టుకున్నా-నర్గీస్ ఫ‌క్

Update: 2021-08-07 04:34 GMT
అందానికి అందం చ‌క్క‌ని న‌ట‌నా నైపుణ్యం ఉన్న మేటి బాలీవుడ్ క‌థానాయిక న‌ర్గీస్ ఫ‌క్రి స‌డెన్ గా ఇండ‌స్ట్రీ నుంచి మాయ‌మైన సంగ‌తి తెలిసిందే. త‌న ట్యాలెంటుకి త‌గ్గ క్రేజీ చిత్రాల్లో ఈ అమ్మ‌డు న‌టించ‌డం లేద‌నేది తెలిసిన మ్యాట‌రే. అయితే అలా ఎందుకు జ‌రిగిందో నిర్భ‌యంగా బ‌హిర్గ‌తం చేసింది తాజా చాటింగ్ లో..

నర్గీస్ ఫక్రి తన నిష్కళంకమైన నటనా నైపుణ్యంతో మ‌న‌సులు గెలుచుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉంది. కానీ అవ‌కాశాలే ఆశించినంత‌గా రాలేదు. ఓ ప్ర‌ముఖ‌ న్యూస్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని పనులు చేయనందున ఉద్యోగాలు (న‌ట‌నా అవ‌కాశాలు) కోల్పోయాన‌ని త‌న కెరీర్ ఆరంభ‌ కష్టాల గురించి వెల్లడించింది. తాను గొప్ప పేరు తెచ్చుకోవాల‌ని దానికోసం ఆకలితో లేనని న‌ర్గీస్ ఫ‌క్రి అన్నారు. నగ్నంగా నటించడం లేదా అవ‌కాశాల కోసం దర్శకుడితో ప‌డుకోవడం వంటివి చేయనని వెల్లడించింది. తన నైతిక విలువ‌ల్ని కాపాడే దిక్సూచిని నిలబెట్టుకోవడానికి తాను హద్దులు పెట్టుకున్నానని చెప్పింది. ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతూ మరింత ఉన్నత ప్రమాణాలు .. సరిహద్దులతో జీవితాన్ని గడుపుతున్నప్పుడు అనేక సినిమాలను కోల్పోయాన‌ని ఆమె చెప్పింది.

``నేను ఉన్నత ప్రమాణాలు సరిహద్దులు ఉన్న చోట జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. దీనివల్ల నేను చాలాసార్లు తరిమివేయబడ్డాను. అది బాధించింది కానీ నేను విలువలు కలిగిన మ‌హిళ‌ను. నా స్వంత మార్గంలో గెలుస్తాను. బహుశా అది నాకు మాత్ర‌మే తెలిసిన మార్గం అని నాకు నేను చెప్పుకుంటూనే ఉన్నాను. నా పట్ల నిజాయితీగా ఉండండి.. మరేదైనా త‌ప్పుడు మార్గానికి నన్ను ఒప్పించవద్దు. నా నైతికత విలువల కంటే మరేదీ గొప్ప కాదు`` అని న‌ర్గీస్ అన్నారు.

బాలీవుడ్ కెరీర్ ఎంచుకున్నాను. మోడల్ గా మొద‌లై న‌టిగా మారాను. కొంద‌రు సెక్స్ సన్నివేశాలు చేయనందున నాకు బాలీవుడ్ లో పనిచేయడం సంతోషంగా అనిపించింది. మోడలింగ్ లో వారు కొన్నిసార్లు టాప్ లెస్ షాట్ లు చేయమని లేదా యాడ్ లో నగ్నంగా క‌నిపించ‌మని అడుగుతారు. కానీ అలాంటి వాటితో నేను ఎప్పుడూ సౌకర్యంగా లేను.. అని న‌ర్గీస్ వెల్ల‌డించారు.

గత కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న నర్గీస్ 2011 లో రణ్ బీర్ కపూర్ హీరోగా ఇంతియాజ్ అలీ తెర‌కెక్కించిన `రాక్ స్టార్` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. న‌ర్గీస్ నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. తరువాత `మద్రాస్ కేఫ్` చిత్రంలో నాయికగా క‌నిపించింది. సల్మాన్ ఖాన్ నటించిన కిక్ లోనూ నటించింది. ఆమె చివరిగా సంజయ్ దత్ తో కలిసి `తోర్బాజ్` అనే చిత్రంలో కనిపించింది.

న‌ర్గీస్ ఆ ఇద్ద‌రిలా కానే కాదు..!

బాలీవుడ్ లో ఏదైనా విష‌యాన్ని సూటిగా బ‌హిర్గ‌తం చేసేందుకు డేర్ చూపించే క‌థానాయిక‌లుగా కంగ‌న ర‌నౌత్ - తాప్సీ ప‌న్ను లాంటి భామ‌లు పాపుల‌ర‌య్యారు. కానీ న‌ర్గీస్ ఫ‌క్రీ ఆ ఇద్ద‌రికంటే విభిన్న‌మైన మ‌న‌స్త‌త్వం ఉన్న న‌టి. న‌ర్గీస్ ఫ‌క్రి అంత‌ర్ముఖిగానే ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగారు. బ‌హిరంగంగా వివాదాల్లోకి రాలేదు. న‌టుడు ఉద‌య్ చోప్రాతో కొన్నాళ్ల పాటు ఎఫైర్ సాగించింద‌న్న ప్ర‌చారం సాగింది. కానీ ఆ త‌ర‌వాత ఈ జంట బ్రేక‌ప్ అయ్యారు. న‌ర్గీస్ - ఉద‌య్ జంట‌గా న‌టించిన క్ర‌మంలో ఎఫైర్ గురించి ప్ర‌చారం సాగింది.




Tags:    

Similar News