ఆమె న‌ట‌న‌లో ‘ప‌రిణితి’ లేద‌ని చెప్పండి చూద్దాం

Update: 2021-05-30 23:30 GMT
విజయం లభించినప్పుడు లోపాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా.. సక్సెస్ వాటిని కవర్ చేసేస్తుంది. కానీ.. అపజయం ఎదురైన‌ప్పుడు లోపాలు పెద్ద‌గా క‌నిపిస్తాయి. ప‌రాజ‌యాలు కంటిన్యూ అయిన‌ప్పుడు లేని లోపాలు కూడా పుట్టుకొస్తాయి. అన్నింటికీ ఇది వ‌ర్తిస్తుంది. ఇక‌, సినిమా గురించి అయితే.. చెప్పాల్సిన ప‌నేలేదు.

బాలీవుడ్ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కెరీరే ఇందుకు నిద‌ర్శ‌నం. ఆరంభంలో సక్సెస్ జోరు కొనసాగించడంతో.. అమ్మడు హ్యాపీగా బండి లాగించింది. కానీ.. గడిచిన కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. దీంతో.. విమర్శల జడి మొదలైంది. ప‌రిస్థితి ఎంత‌దాకా వెళ్లిందంటే.. ఈమెకు అస‌లే న‌ట‌నే రాదు అనికూడా అనేశారు కొంద‌రు. రానురానూ ఇలాంటి వాళ్ల సంఖ్య‌ పెరుగుతూ వ‌చ్చింది కూడా.

ఇలాంటి ప‌రిస్థితులతో ఎంతో స్ట్ర‌గుల్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టింది. అదికూడా రెండు నెల‌ల్లో మూడు స‌క్సెస్ లు సాధించి, తానేంటో చాటిచెప్పింది. ప‌రిణీతి న‌టించిన ‘ది గర్ల్
ఆన్ ది ట్రైన్’ మూవీతో మంచి హిట్ కొట్టింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ‘సందీప్ ఔర్ పింకీ ఫ‌రార్‌’ కూడా మంచి ప్ర‌శంసలు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత సైనా బ‌యోపిక్ కూడా మంచిపేరే తెచ్చింది.

ఈ విధంగా.. హ్యాట్రిక్ విజ‌యాల‌తో మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిందీ బ్యూటీ. అయితే.. ఈ స‌క్సెస్ ఆయాచితంగా వ‌చ్చిందేమీ కాదు. ఎంతో క‌ష్ట‌ప‌డిందీ అమ్మ‌డు. త‌న న‌ట‌న‌లో ప‌రిణితి లేద‌న్న‌వారికి.. ఈ విజ‌యాలతో ప‌రిణీతి స‌మాధానం చెప్పింద‌ని అంటున్నారు.


Tags:    

Similar News