పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచిగా ఉంటుంది. లోకల్ ట్యాలెంట్ మనవాళ్ల కంటికి ఏమాత్రం కనిపించదు. అసలు ఇరుగు పొరుగు నుంచి కథానాయికల్ని తేవాల్సిన అవసరం ఏమిటి? పైగా ముంబై వెళ్లి వెతకాల్సిన పనేమిటి ? బాలీవుడ్ కథానాయికల్ని దించకపోతే ప్రాజెక్టుకు క్రేజు రాదా? అంటే .. రకరకాల కోణాల్లో విశ్లేషించాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో సరళిని పరిశీలిస్తే అసలు బాలీవుడ్ బ్యూటీలు మనకి కలిసి రావడం లేదు. డార్లింగ్ సరసన ఉత్తరాది భామల్ని ఎంపిక చేస్తే.. మాస్ ని ఎంజాయ్ చేసే తెలుగు బి క్లాస్.. సీ క్లాస్ ఆడియెన్స్ కి వీళ్లు అస్సలు నచ్చడం లేదు. దీపిక పదుకునే వల్ల మార్కెటింగ్ పరంగా బాలీవుడ్ లో బాగానే వర్కవుట్ అవుతుంది దానికి ఒప్పుకుంటాం కానీ.. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పాపులారిటీ ఉన్న భామల్నే హీరోయిన్లుగా ప్రభాస్ పక్కన తీసుకుంటే బెటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇప్పటికే సాహో ఫ్లాప్ కి కారణాల్లో ముంబై బ్యూటీ శ్రద్ధ కపూర్ ని కూడా కలిపేశారు ఫ్యాన్స్. ఈ వేడి చల్లారక ముందే మళ్లీ ఇంకో బాలీవుడ్ బ్యూటీని ప్రభాస్ నాయికగా తీసుకోవడం ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం దీపిక పదుకొనేకి కూడా బాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోయింది. అందుకే దీపిక సౌత్ లో తన మార్కెట్ ని పెంచడానికి ప్రభాస్ తో కలిసి నటించడానికి ఒప్పుకుందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అక్కడ ఎలానూ అగ్ర హీరోల సరసన సినిమాలేవీ లేవు. పెళ్లి తర్వాత ఇమేజ్ పూర్తిగా సైడైపోయింది. అయితే భర్త రణవీర్ తో నటించాలి. లేదంటే లేడీ ఓరియెంటెడ్ కి మొగ్గు చూపాలి. అంతవరకూ ఆడియెన్ కూడా తనని దృష్టిలో పెట్టుకున్నారన్నది ఫ్యాన్స్ వాదన.
ఒకప్పటిలా ఇప్పటి నాయికలు లేరు. శిల్పాశెట్టి- రవీనా టాండన్- ప్రీతి జింతా- కత్రిన టైపులో నేటితరం నాయికలు ఎవరూ ఇక్కడ మన తెలుగు హీరోలకు సెట్ కావడం లేదు. నిలదొక్కుకుంటున్నదీ లేదు. అందుకే ఇప్పుడు శ్రద్ధా కపూర్ .. దీపిక లాంటి భామలు వచ్చినా ఇక్కడ చేసేదేమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్లంతా ఇప్పుడు మన దృష్టిలో ఫేడవుట్ భామలు. ఈ భామల్ని మించిన అందగత్తెలు ప్రతిభావంతులు ఇటీవల సౌత్ లో పుట్టుకొచ్చారు. సౌత్ ర్యాంప్ వాక్ మోడల్స్ ధీటుగానే రాణిస్తున్నారు. అందుకే వీళ్లపై ఈ విమర్శలు తప్పడం లేదు. అయినా హిట్టును నమ్మే పరిశ్రమకు కథానాయికల ఎంపిక అన్నది కొంతవరకే ప్రభావం చూపగలదు.