బాలీవుడ్ సినిమా సరళి పూర్తిగా మారింది. కొంత కాలంగా హిందీ సినిమా కమర్శియాల్టీకి దూరంగా ఉందన్నది వాస్తవం. ప్రేక్షకులకు కొత్త ఫీల్ అందించాలన్న ఆత్రంలో పడి కథల స్వరూపాన్నే మార్చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడా కమర్శియల్ అంశాలు జొప్పించడంలోనూ విఫలమవుతున్నారు. స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద విఫలమవ్వడనికి ప్రధాన కారణం ఇదేనన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది.
ఇదే క్రమంలో బయోపిక్ ల ఎరా కూడా కొంత వరకూ బాలీవుడ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందన్న విమర్శ వినిస్తుంది. కొన్ని బయోపిక్ లు సక్సెస్ అయినా మరికొన్ని ఫెయిలవుతున్నాయి. ఎమోషన్ ఉన్న కథలన్నింటికి మంచి సక్సెస్ రేటు ఉంది. ఫెయిలైన కథలో ఎమోషన్ మిస్ అయిందనే విమర్శ తెరపైకి వచ్చిందని కొన్ని బయోపిక్ లు చూస్తేనే అర్ధం అవుతుంది. అవి కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ కే పరిమితమవుతున్నాయి.
మాస్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో బయోపిక్ లు కొన్ని సార్లు విఫలమవుతున్నాయి. ఆ రకంగా కొన్నాళ్లగా బాలీవుడ్ లో సక్సెస్ రేటు బాగా పడిపోయింది. ఇదే క్రమంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. కొన్ని సౌత్ రీమేక్ సినిమాలు హిందీ లో సక్సెస్ అవ్వడం తో బాలీవుడ్ కి చేవ లేదా? అన్న విమర్శ తెరపైకి వస్తోంది.
ఇటీవలే కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకునే బాలీవుడ్ వైఫల్యాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. సల్మాన్ ఖాన్..అక్షయ్ కుమార్ లాంటి వారు తమ సినిమాల్లో తప్పక కమర్శియల్ అంశాలు ఉండేలా చూసుకుంటారు. డిఫరెంట్ అటెంప్ట్ లకు సల్మాన్ లాంటి హీరో కాస్త దూరంగానే ఉంటారు.
అన్ని వర్గాల ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా ఆయన సినిమాలుంటాయి. షారుక్ ఖాన్ పంథా లో ఇటీవల మార్పు కనిపిస్తుంది. హృతిక్ రోషన్ ఇలాంటి అటెంప్ట్ లు చేయడానికి ఏమాత్రం ఆలోచించడు. ఆ రకంగా హృతిక్ ని సల్మాన్..షారుక్ తో పొలిస్తే కమర్శియల్ స్టార్ గా అభివర్ణించలేం. ఇవన్నీ బేరీజు వేసుకునే ఈ ముగ్గురు స్టార్లు ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ముందుకొస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
`టైగర్ -3` తో సల్మాన్.. `పఠాన్` తో షారుక్...`ఫైటర్` గా వస్తోన్న హృతిక్ రోషన్ చిత్రాల్లో తప్పక కమర్శియల్ అంశాలు జొప్పించి ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు. గత పరాభవాల్ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ వాటిని పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. మరి అభిమానుల ఆశల్ని.. అంచనాల్ని నిజం చేస్తారా? ఒమ్ము చేస్తారా? అన్నద రిలీజ్ తర్వాత గాని క్లారిటీ రాదు.