ఒకప్పుడు బాలీవుడ్ జనాలు సౌత్ సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మనవాళ్ళు ఎంత మంచి సినిమా తీసినా.. దాన్ని ప్రాంతీయ చిత్రంగానే చిన్నచూపు చూసేవారు. మన స్టార్లకు తగిన గౌరవం కూడా ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
సౌత్ సినిమా అంటే పాన్ ఇండియా అనే రోజులు వచ్చాయి. ఎక్కడ చూసినా మన సినిమాల గురించి.. సౌత్ ఇండియా స్టార్స్ గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో నేషనల్ వైడ్ రిలీజ్ చేయబడిన పలు దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా 'పుష్ప' 'ఆర్.ఆర్.ఆర్' 'కేజీయఫ్-2' వంటి సినిమాలు నార్త్ సర్క్యూట్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టించాయి. హిందీ సినిమాలకు సాధ్యంకాదేమో అనుకునే రీతిలో అక్కడ సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. మన సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ దెబ్బకు బాలీవుడ్ బిగ్ స్టార్స్ నటించిన చిత్రాలు కూడా తోక ముడుస్తున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బాలీవుడ్ పై సౌత్ సినిమా డామినేషన్ నడుస్తోంది. మన హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా అవతరిస్తున్నారు. అయితే దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న కారణంగా సౌత్ స్టార్స్ పై కొందరు బాలీవుడ్ స్టార్స్ అసూయతో రగిలిపోతున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వారు బాలీవుడ్ కు చురకలు అంటిస్తున్నారు. అయినప్పటికీ ఉత్తరాది నటులు సౌత్ సక్సెస్ పై తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. బలుపు మాటలతో అసూయను బయటపెడుతున్నారు.
దక్షిణాది సినిమాల విజయం పై ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ కామెంట్స్ చేయగా.. తాజాగా హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. కమర్షియల్ సినిమాలంటే తనకు ఆసక్తి ఉండదని.. తాను ఇంతవరకు ఒక్క సౌత్ మూవీ కూడా చూడలేదని పేర్కొన్నారు.
ఒక సినిమా హిట్టయితే అంతా ఏకమై దాన్ని ఆకాశానికెత్తడం.. అంతగా కలెక్షన్లు రాకుంటే వెంటనే విమర్శలు చేయడం సర్వసాధారణమన్నారు. ఇప్పుడిదో ఫ్యాషన్ అయిపోయిందని.. ఈ పరిస్థితులు ట్రెండ్ లాగా ఎప్పటికప్పుడు మారుతుంటాయని.. బాలీవుడ్ కు ఒక్క బ్లాక్ బస్టర్ పడితే అంతా సర్దుకుంటుందని నవాజుద్దీన్ అన్నారు.
మసాలా కంటెంట్ తో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. కానీ ఈ మార్పు అంత మంచిది కాదంటూ 'పేట' విలన్ సౌత్ సినిమాలపై అక్కసు వెళ్లగక్కారు. 'హీరో పంటి-2' మూవీ ప్రమోషన్స్ లో భాగాంగా నవాజుద్దీన్ సిద్దిఖీ ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం కూడా ప్రాంతీయ సినిమాలపై చిన్నచూపుతో మాట్లాడారు. 'ఇతర నటీనటుల మాదిరిగా తెలుగు లేదా మరో ప్రాంతీయ భాషా చిత్రంలో నేనెప్పటికీ నటించను. నేనొక హిందీ సినిమా హీరోని. యాక్టర్ ని కాబట్టి ఏదొక సినిమాలో కనిపించాలనే ఉద్దేశంతో నటించను' అని జాన్ అన్నారు.
అలానే బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్ 2 - పుష్ప - RRR చిత్రాలు హిందీలో మంచి వసూళ్లు సాధించాయి. మంచి సినిమా హిట్ అవుతుంది.. లేకుంటే ప్లాప్ ఎక్కడైనా ప్లాప్ అవుతుంది. బాలీవుడ్ లో మంచి కంటెంట్ సినిమాలు రావట్లేదనడం సరికాదన్నారు.
ఇండియాలో ఒక ఏడాదిలో వెయ్యికి పైగా చిత్రాలు వస్తుంటే.. అందులో కేవలం రెండు చిత్రాలు ట్రెండ్ ను ఎలా నిర్దేశిస్తాయి?' అంటూ RRR - కేజీఎఫ్ 2 సినిమాల సక్సెస్ ను ఉద్దేశిస్తూ అభిషేక్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సౌత్ సినిమా సక్సెస్ పై బాలీవుడ్ స్టార్స్ స్పందించిన తీరు చూస్తుంటే.. మన సినిమాల డామినేషన్ వారికి మింగుడు పడటం లేదనేది స్పష్టంగా అర్థం అవుతోంది. అదే సమయంలో మనోజ్ బాజ్ పాయి వంటి హిందీ నటుడు దక్షిణాది సినిమాలను ప్రశంసించారు.
సౌత్ సినిమాలు చూసి బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారని.. వెన్నులో వణుకు పుడుతోందని.. ఏం చేయాలో వారికి అంతుపట్టడం లేదని అన్నారు. సౌత్ సినిమాల సక్సెస్ ను ఒక పాఠంగా భావించి.. బాలీవుడ్ మేకర్స్ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మనోజ్ బాజ్ పాయ్ అభిప్రాయ పడ్డారు.