ఇటీవలే టెలికాస్ట్ అయిన కాఫీ షో విత్ కరణ్ బాహుబలి టీం ఎపిసోడ్ పలు చర్చలకు వేదికగా మారుతోంది. ప్రభాస్ పెళ్లి గురించి అనుష్క డేటింగ్ లాంటివి నేరుగా అడిగేసిన కరణ్ మొత్తానికి బాహుబలి పుణ్యమా అని సౌత్ స్టార్స్ తో పెద్ద రచ్చె చేసాడు. అయితే ప్రశ్నల్లో భాగంగా రాజమౌళి ఇచ్చిన సమాధానాల్లో ఒకటి మాత్రం హాట్ టాపిక్ గా మారింది. సౌత్ స్టార్లు ప్రేక్షకులకు ఏం కావాలో అలాంటివాటిని గుర్తించి సినిమాలు చేస్తారని కాని నార్త్ హీరోలలో ఇది కొరవడిందని చెప్పేసాడు. అదొకటి ట్విస్ట్ అనుకుంటే కరణ్ దానికి అవును అంటూ మద్దతు పలకడం ఇప్పుడు కొందరు బాలీవుడ్ హీరోలకు ఎక్కడో మండేలా చేసిందని సమాచారం.
రాజమౌళి అంటే వేరే బాష నుంచి గెస్ట్ గా వచ్చాడు కాబట్టి ఏదో అన్నాడులే అనుకోవచ్చు. హింది సినిమాల ద్వారా తన ఉనికిని గుర్తింపును తెచ్చుకున్న కరణ్ జోహార్ వాటికి మద్దతు పలకడం ఏమిటని అతనికే ఫోన్ చేసి నిలదీస్తున్నారట. కాకపోతే దీని గురించి పబ్లిక్ గా ఏమి అనలేని పరిస్థితి. నిజంగానే బాలీవుడ్ లో ఈ ఏడాది స్టార్ హీరోలు దారుణమైన సినిమాలు చేసారు. సల్మాన్ ఖాన్ రేస్ 3తో నవ్వులపాలు కాగా అమీర్ ఖాన్ స్వయంగా నా సినిమా పోయింది అంటూ తగ్స్ అఫ్ హిందూస్తాన్ పుణ్యమా అని ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఇక షారుఖ్ ఖాన్ జీరో తెచ్చుకున్న చెడ్డపేరు ఇచ్చిన నష్టాలు గురించి రాయాలంటే ఒక పుస్తకమే అవుతుంది. అంటే ప్రేక్షకుల నాడిని పసిగట్టడంలో వీళ్ళు ఫెయిల్ అయినట్టేగా. అందుకే రాజమౌళికి ఇప్పటికిప్పుడు కౌంటర్ ఇచ్చినా సోషల్ మీడియాలో ఇలాంటి సమాధానాలతో ఎదురు దాడి జరుగుతుంది కాబట్టి సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి వార్తల్లో నిలవడంలో రాజమౌళిని మించిన వారు లేరేమో అనిపిస్తుంది కదూ