'వలిమై' థియేటర్ వద్ద బాంబు దాడి..!

Update: 2022-02-24 15:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ''వలిమై'' గురువారం (ఫిబ్రవరి 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. తమిళనాడులో అన్ని థియేటర్ల వద్ద  అభిమానుల కోలాహలంతో పండగ వాతావరణం కనిపించింది. అయితే ఈ సంబ‌రాల్లో ఆప‌శ్రుతి చోటు చేసుకుంది.

కోయంబ‌త్తూరులోని గంగవ‌ల్లి మ‌ల్టీప్లెక్స్‌ లో 'వాలిమై' సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు థియేటర్ వద్ద సంబ‌రాలు చేసుకుంటున్న సమయంలో.. ముగ్గురు దుండ‌గులు పెట్రోల్ బాంబుల‌తో దాడి చేశారు. బైక్ వ‌చ్చిన ముగ్గురు దుండ‌గులు బాంబులు వేయడంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ దాడిలో ముగ్గురు అభిమానుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. అజిత్ ఫ్యాన్స్ దుండ‌గులను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన్నప్పటికి.. వారు త‌ప్పించుకు పారిపోయారు. ఈ దాడి గురించి తెలుసుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని విచార‌ణ‌ను ప్రారంభించారు. దాడికి గల కారణాలేంటి?, ఎవరు చేశారనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

'వలిమై' చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిచారు. అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌ గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ మెయిన్ విలన్ గా కనిపించారు. దీంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ యాక్షన్ మూవీపై ఆసక్తి నెలకొంది.

ప్రమోషనల్ కంటెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన 'వలిమై' సినిమా తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కథా నేపథ్యం.. అజిత్ - కార్తికేయ నటన ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న బైక్ రేసింగ్ స‌న్నివేశాలు మెస్మ‌రైజ్ చేస్తున్నాయ‌ని ఫ్యాన్స్ అంటున్నారు.

సెకండ్ హాఫ్ మరియు కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు డ్రాబ్యాక్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. జీ స్టూడియోతో క‌లిసి బే వ్యూ ప్రాజెక్ట్ బ్యాన‌ర్‌ పై బోనీ క‌పూర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.
Tags:    

Similar News