సినిమా ఫ్లాప్ కావడం అంటే ఏంటీ? ఒక ఐడియా చాలా మందికి నచ్చకపోడం. హిట్ కొట్టడం అంటే.. ఎక్కువ మందికి నచ్చడం. దట్సాల్. మిగతా దంతా సేమ్ టూ సేమ్. ఒక హిట్ సినిమాను ఎలా తెరకెక్కిస్తారో.. ఫ్లాప్ సినిమా సైతం అదే విధంగా రూపొందుతుంది. అవి రిలీజ్ అయిన తర్వాతగానీ.. ఎంత మందికి నచ్చిందనే విషయం ఆధారంగా.. హిట్టు, ఫ్లాపు అని డిసైడ్ చేస్తారు. కానీ.. ఆ సినిమాను తీసిన దర్శకుడికి మాత్రం ప్రతిసినిమా ఒక్కటే.
ఆ విధంగా చూసుకున్నప్పుడు తనకు ఆరెంజ్ సినిమా ఎంతో స్పెషల్ అంటున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. 'బొమ్మరిల్లు' సినిమాతో ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నాడు భాస్కర్. ఆ తర్వాత పరుగు కూడా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో తెరకెక్కించిన చిత్రం ఆరెంజ్. జీవితంలోని వాస్తవాలను ముసుగు తీసి మరీ చూపించిన ఈ సినిమా చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే.. అబద్ధమే హాయిగా ఉంటుంది కదా! అందుకే.. వాస్తవం చూపించిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ జాబితాలో చేరలేదు. కానీ.. నిజాలను అంగీకరించే వర్గానికి మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చింది.
ఇదే విషయాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు భాస్కర్. అంతేకాదు.. తనను ఆరెంజ్ వంటి సినిమా తీయాలని కూడా కోరుతారట. వాళ్లు కోరడమే కాదు.. తనకు కూడా ఆరెంజ్ సినిమా ఎంతో స్పెషల్ అని చెప్పాడు బొమ్మరిల్లు భాస్కర్. తన కెరియర్లోనే అత్యంత కష్టపడి, ఎంతో ఇష్టపడి తీసిన సినిమా కూడా ఇదేనని చెప్పారు.
రాత్రి, పగలు తేడా లేకుండా స్క్రిప్టు కోసం శ్రమించినట్టు చెప్పాడు. అయితే.. స్క్రీన్ ప్లే దారితప్పడం వల్ల తేడా వచ్చిందని అన్నాడు. అయినప్పటికీ.. ఆ చిత్రానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని చెప్పాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. కాగా.. చాలా గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా తెరకెక్కించాడు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరి, అతని కెరీర్ కు ఎంతో కీలకమైన ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.