ఈ శతాబ్దంలో వచ్చిన అత్యుత్తమ తెలుగు చిత్రాల్లో ‘బొమ్మరిల్లు’ పేరు కచ్చితంగా ఉంటుంది. అలాంటి గొప్ప సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు భాస్కర్. రెండో సినిమా ‘పరుగు’ కూడా భాస్కర్ కు మంచి పేరే తెచ్చింది. కానీ ఆ తర్వాత ‘ఆరెంజ్’ పుణ్యమా అని అతడి రాతే మారిపోయింది. తెలుగులో ‘ఒంగోలు గిత్త’.. తమిళంలో ‘బెంగళూరు నాట్కల్’ డిజాస్టర్లవడంతో భాస్కర్ అడ్రస్ గల్లంతయిపోయింది. భాస్కర్ అనే ఓ దర్శకుడు టాలీవుడ్లో ఉన్నాడన్న సంగతే జనాలు మరిచిపోయేు పరిస్థితి వచ్చింది. ఇక అతడికి మరో అవకాశం దక్కడే కష్టమే అని ఫిక్సయిపోయారంతా.
ఐతే గీతా ఆర్ట్స్ సంస్థ భాస్కర్ కు మళ్లీ లైఫ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ‘బెంగళూరు నాట్కల్’ తర్వాత తిరిగి తెలుగులోనే తనేంటో రుజువు చేసుకోవాలని భాస్కర్ పట్టుదలతో ఓ కథ రాసి.. అల్లు అరవింద్ ను కలిశాడట. ఆయనకు ఆ కథ నచ్చిందని.. దాని మీద మరింత వర్క్ చేయమని అన్నారట. ప్రస్తుతం ఆ పనిలోనే తలమునకలై ఉన్నాడు భాస్కర్. మరి అరవింద్ తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని హీరోగా పెట్టి ఈ సినిమా తీస్తాడా.. లేక మెగా ఫ్యామిలీలోనే ఇంకో హీరోను ట్రై చేస్తాడా.. లేక నానితో ‘భలే భలే మగాడివోయ్’ చేసినట్లు బయటి హీరోను ఎంచుకుంటాడా.. చూద్దాం ఏమవుతుందో? హీరో ఎవరైనా భాస్కర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతడికి అవకాశం దక్కడమే గొప్ప.