జేమ్స్ బాండ్ 007 సిరీస్ ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనేలేదు. గూఢచర్యాన్ని మరో లెవల్లో చూపించిన గ్రేట్ యాక్షన్ సిరీస్ ఇది. ముఖ్యంగా యాక్షన్.. ఛేజ్ లు .. రొమాన్స్ సహా అన్నిరకాల మసాలా అంశాల మేళవింపుతో ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీ 25వ సినిమా `నో టైమ్ టు డై-007` సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో డేనియల్ క్రెయిగ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. కెర్రీ జోజి ఫకునగ దర్శకత్వం వహిస్తున్నారు. బార్బరా బ్రకోలి- మైఖేల్.జి.విల్సన్ బాండ్ 25 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ .. ఛేజ్ లు.. రొమాన్స్ .. మాస్ మసాలా అంశాలతో అదిరిపోయింది. ముఖ్యంగా ఈసారి బాండ్ 007 పక్కా స్టోరీ బేస్డ్ గా అథెంటిక్ గా కనిపిస్తోంది. ఇందులో స్క్రీన్ ప్లే పరమైన జిమ్మిక్కులు ఆకట్టుకోవడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
51 ఏజ్ లోనూ క్రెయిగ్ రెట్టించిన ఉత్సాహంతో ఛేజ్ లు యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. రొమాన్స్ కి కొదవేమీ లేదని ట్రైలర్ చెబుతోంది. ఇక ఇందులో నల్ల జాతి నటులకు పెద్ద పీట వేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక డేనియల్ నటించిన గత నాలుగు చిత్రాలు ఘనవిజయం సాధించడంతో మరోసారి అతడినే రిపీట్ చేస్తుండడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హెచ్ బీవో పాపులర్ సిరీస్ `ట్రూ డిటెక్టివ్`తో వరల్డ్ వైడ్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న గ్రేట్ డైరెక్టర్ కెర్రీ దీనికి దర్శకత్వం వహిస్తుండడం మరో డిబేటబుల్ పాయింట్.
ఇప్పటివరకూ బాండ్ 007 సిరీస్ లో 14 సినిమాలు రిలీజైతే అందులో కేసినో రాయల్- క్వాంటమ్ ఆఫ్ సోలేస్- స్కై ఫాల్- స్పెక్టర్ ..ఈ నాలుగు చిత్రాల్లో క్రెయిగ్ నటించాడు. ఇవన్నీ ఇప్పటికే రిలీజై సంచలన విజయం సాధించాయి. `నో టైమ్ టు డై` అంటూ ఈసారి అదిరిపోయే స్టింట్ తో బాండ్ 2020 ఏప్రిల్ 8న అభిమానుల ముందుకు రాబోతున్నాడు. రమీ మాలిక్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో క్రిస్టోఫ్ వాల్ట్జ్ మరో ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ మిలియనీర్ డైరెక్టర్.. ఆస్కార్ విజేత డానీ బోయ్ లే దర్శకత్వం వహించాల్సి ఉండగా ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే.
Full View