జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందిన 'మిలీ' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం హెలెన్ కి ఇది రీమేక్. హెలెన్ సినిమాకు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వంలోనే రీమేక్ 'మిలీ' రూపొందింది.
ఈ రీమేక్ ను జాన్వీ కపూర్ తండ్రి అయిన బోనీ కపూర్ నిర్మించాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా గత వారం రోజులుగా జాన్వీ కపూర్ మీడియాలో హడావుడి చేస్తున్న విషయం తెల్సిందే. సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డానో ఇటీవల ఇంటర్వ్యూ లో జాన్వీ కపూర్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
తాజాగా మిలీ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నిర్మాత అయిన బోనీ కపూర్ స్పందించాడు. ఆయన ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ జాన్వీ కపూర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. తన కూతురు గా కాకుండా సొంతంగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. జాన్వీ కామెడీ సినిమాల్లో చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె కామెడీ బాగా చేస్తుంది. అద్భుతమైన కామెడీ టైమింగ్ ను శ్రీదేవి కలిగి ఉండేది. ఇప్పుడు అదే తరహా కామెడీ టైమింగ్ ను జాన్వీ కపూర్ కలిగి ఉందన్నాడు.
అంతే కాకుండా శ్రీదేవి ఎలా అయితే సినిమా కోసం కష్టపడేదో జాన్వీ కపూర్ కూడా సినిమా అంటే ప్రాణం పెడుతుందని బోనీ పేర్కొన్నాడు. ఈ రెండు విషయాల్లో శ్రీదేవి మరియు జాన్వీ కపూర్ సేమ్ టు సేమ్ అంటూ బోనీ కపూర్ వ్యాఖ్యలు చేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.