మనసులో ఉన్న ప్రతిది ఉన్నది ఉన్నట్లుగా చెబితే చిరిగి చేటంత కావటం ఖాయం. కానీ.. అలాంటివి లైట్ తీసుకునే సినీరంగ ప్రముఖుడు రాంగోపాల్ వర్మ. వివాదాలతో సహజీవనం చేసే అతగాడికి.. అతిలోక సుందరిగా పేరున్న శ్రీదేవి అంటే ఎంత అడ్మైరింగో.. వర్మ గురించి ప్రతిఒక్కరికి తెలుసు. ఒక సినీ ప్రముఖరాల్ని.. అందునా పెళ్లి అయి.. పిల్లలున్న ఒక సెలబ్రిటీ మీద తనకున్న క్రష్ ను ఇంత బాహాటంగా ఎవరూ చెప్పరేమో. శ్రీదేవి మీద ఇష్టం ఉంటే ఫర్లేదు.. కానీ.. కాస్త శృతిమించి ఆమె భర్త.. బోనీకపూర్ మీద రెగ్యులర్ గా టంగ్ స్లిప్ అవుతుంటాడు. తన భార్య మీద ఇంతకాలం వర్మ ఏమన్నా పెద్దగా రియాక్ట్ కానీ.. బోనీకపూర్ తాజాగా మాత్రం ఆర్జీవీ మీద సీరియస్ అయ్యాడంట.
తాజాగా అతనగాడు తన జీవితకథ ‘‘గన్ అండ్ దైస్’’లో శ్రీదేవి మీద ఒక అధ్యాయాన్ని కేటాయించటం.. ఆ అధ్యాయం ఒక ప్రేమలేఖలా ఉంటుందని ఊరిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి పట్ల తనకున్న ఆకర్షణ ఒక డ్రగ్ లాంటిదంటూ వ్యాఖ్యానించటంతో పాటు.. గతంలో శ్రీదేవి చేత టీ పెట్టించేందుకు వంటింట్లోకి పంపిన బోనీకపూర్ ను క్షమించనని చెప్పటంతో.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
తన జీవితకథకు సంబంధించి శ్రీదేవికి ఒక అధ్యాయాన్ని కేటాయించానంటూ తరచూ మీడియాతో చెబుతున్న మాటలు ఆమె భర్త బోనీకపూర్ కు మంట పుట్టించినట్లున్నాయి. ఎప్పుడూ కూల్ గా ఉండే ఆ పెద్దమనిషి.. రాంగోపాల్ మీద విరుచుకుపడినట్లుగా చెబుతున్నారు. రాంగోపాల్ వర్మను పర్వర్టెడ్ మైండ్ సెట్ అని మండిపడినట్లుగా చెబుతున్నారు. పబ్లిసిటీ కోసం రాము ఇలాంటి పనులు చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడట. వెర్రి మనిషి అని చెబుతూ.. వర్మను కెలికి బోనీకపూర్ తప్పు చేశాడా? లేదా? అన్నది ఆర్జీవీ రియాక్షన్ తో తెలవటం ఖాయమంటున్నారు.