మలైకాతో ఎఫైర్.. కొడుక్కి బోనీ వార్నింగ్?

Update: 2016-05-12 16:24 GMT
దశాబ్దంన్నర పాటు అన్యోన్యంగా వైవాహిక జీవితం సాగించారు అర్బాజ్ ఖాన్..మలైకా అరోరా. వాళ్లిద్దరి పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్లవుతున్న తరుణంలో డైవర్స్ కు అప్లై చేయడం.. విడిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అర్బాజ్ కు ఇష్టం లేకపోయినా మలైకానే అతడి నుంచి విడిపోయినట్లు వార్తలొచ్చాయి. యువ కథానాయకుడు అర్జున్ కపూర్ తో ఎఫైరే ఆమె అర్బాజ్ నుంచి విడిపోవడానికి కారణమన్న రూమర్లు వినిపించాయి.

ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఈ మధ్య అర్ధరాత్రి సమయంలో మలైకాతో ఆమె ఫ్లాట్లో అర్జున్ కపూర్ ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో విస్తృతంగా వార్తలొచ్చాయి. ఓ ఫొటోగ్రాఫర్ వీరి ఎఫైర్ ను బయటపెట్టేందుకు అదే పనిగా అర్జున్ ను ఫాలో అవుతూ.. అతను మలైకా ఫ్లాట్లోకి వెళ్తుండగా పట్టేశాడు. దీని మీద పెద్ద గొడవే నడిచింది. అర్జున్.. మలైకా ఫ్లాట్ కు వచ్చిన మాట వాస్తవమని.. ఐతే అతణ్ని ఫొటో మాత్రం తీయలేకపోయామని.. పోలీసుల్ని పిలిపించి తమను అక్కడి నుంచి వెళ్లగొట్టించాడని ఓ ఫొటోగ్రాఫర్ మీడియాతో పేర్కొన్నాడు.

ఈ సంగతలా ఉంచితే.. తన తమ్ముడి మాజీ భార్యతో ఎఫైర్ నడుపుతున్నందుకు సల్మాన్ కచ్చితంగా అర్జున్ మీద నిఘా పెట్టి ఉంటాడని.. అతణ్ని దెబ్బ తీయక మానడని బోనీకపూర్ భయపడుతున్నాడట. తన కొడుకు అర్జున్ ను ఈ వ్యవహారాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాడట. హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అర్జున్.. సల్మాన్ తో పెట్టుకుంటే మటాష్ అయిపోతాడని చెప్పి అతడికి గట్టి వార్నింగే ఇచ్చాడట. ఇకపై మలైకా జోలికి వెళ్తే ఖబడ్దార్ అంటూ కొడుక్కి బోనీ చాలా సీరియస్ గానే చెప్పినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. మరి అర్జున్ ఈ హెచ్చరికల్ని పట్టించుకుంటాడా.. లైట్ తీసుకుంటాడా?

Tags:    

Similar News